సిపిఐ ఎంఎల్ మాస్ లైన్
కారేపల్లి నేటి ధాత్రి
దండి గుండె గల ఉక్కుమనిషి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సీనియర్ నాయకులు, సింగరేణి-కామేపల్లి సంయుక్త మండలాల మాజీ కార్యదర్శి అమరుడు కామ్రేడ్ గండి యాదగిరి అలియాస్ యాదన్న పేరు మీద ఏప్రిల్ 6న కారేపల్లి మండల కేంద్రంలో కామ్రేడ్ యాదన్న స్మారక భవనం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పెళ్లి మండల కార్యాలయం నిర్మాణ ప్రారంభం చేస్తున్నట్టుగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) సంయుక్త మండలాల కార్యదర్శి గుమ్మడి సందీప్, సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్ డివిజన్ నాయకులు గుగులోతు తేజ అన్నారు
కామ్రేడ్ యాదన్న కారేపల్లి ప్రాంతంలో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారని బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమని ఆయన త్యాగాన్ని కొనియాడారు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ప్రభుత్వ ఉద్యోగాలను వదిలివేసి గిరిజనలు గిరిజనేతరులు పేదల సమస్యల పరిష్కారం కోసం విప్లవబాట పట్టారని అన్నారు నిత్యనిర్బంధాలు అరెస్టులు జైలు జీవితాన్ని ఎదుర్కొని ప్రజా ఉద్యమాన్ని కాపాడారని అన్నారు యాదన్న మార్చి 30న ఆరోగ్యంతో అమరత్వం పొందారు ప్రజా సమస్యల పరిష్కారం కై పోరాటాలు నిర్వహించి సమసమాజ స్థాపన కోసం పనిచేసిన యాదన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా సమస్యల పరిష్కారం నిలయంగా యాదన్న భవనం ఉండాలని కోరుతూ ఏప్రిల్ 6న కారేపల్లి మండల కేంద్రంలో కామ్రేడ్ గండి యాదన్న స్మారక భవనం నిర్మాణ ప్రారంభం చేయటం జరుగుతుంది సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కారేపల్లి మండల కార్యాలయ నిర్మాణానికి మండలంలోని ప్రజలు ప్రజాస్వామికవాదులు విప్లవ శ్రేణులు రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు మీడియా మిత్రులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.