అద్భుతముగా జరుగుతున్న దేవుని రాజ్య సువార్త మహాసభలు
నేడు చివరి రోజు మహాసభలకు అనేకులు రానున్నారు
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కొనసాగుతున్న దేవుని రాజ్య సువార్త మహాసభలు ఎంతో అద్భుతంగా దేవునికి మహిమ కరంగా జరుగుతున్న ఇట్టి మహాసభలో నియోజకవర్గంతో పాటు వివిధ మండలాలలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందుతున్నారు. నేడు సాయంత్రం చివరి రోజు కావున ఇట్టి మహాసభలో అనేకులు పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి అని ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం దైవ సేవకులు సి. హెచ్ డేవిడ్ సంఘ పెద్దలు విశ్వాసులు పిలుపునిచ్చారు.