హాజరుకానున్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.
సీసీపిఎల్ అధ్యక్షులు చింతల మహేందర్.
చిట్యాల,నేటిధాత్రి :
చిట్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్(సీసీపీఎల్) జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు మంగళవారం ఫైనల్ తో ముగియనున్నట్లు సీసీపీఎల్ అధ్యక్షులు చింతల మహేందర్ తెలిపారు. ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే, ప్రైజ్ మనీ సమర్పకులు(రూ.1,00,000) గండ్ర సత్యనారాయణ రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత రెండు నెలలుగా ఉత్సాహవంతంగా కొనసాగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగింపు దశకు చేరుకున్నట్లు చెప్పారు. నేటి ఫైనాన్స్లో చిట్యాల మండల కేంద్రానికి చెందిన డ్రీమ్స్ – 11, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కింగ్స్ – 11 మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తలపడనున్నట్లు చెప్పారు. టోర్నమెంట్ స్కోర్ వివరాలను ‘క్రిక్ హీరో’ యాప్ లో వీక్షించవచ్చని, విజేతలకు బహుమానాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు. ప్రథమ బహుమతిగా ట్రోఫీ(కప్) తోపాటు రూ.70 వేలను, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలను అందజేయనున్నారు. ఇంత పెద్ద మెగా టోర్నీకి ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, క్రీడాకారులు, అభిమానులు హాజరై, అవార్డు అందజేత వేడుకను విజయవంతం చేయాలని విజ్ఞప్తి సీసీపీఎల్ అధ్యక్షులు మహేందర్ చేశారు.