చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలోని గచ్చుబావి ఆవరణలో గురువారం నిర్వహించనున్న అయ్యప్ప స్వామి మహ పడిపూజ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని అయ్యప్ప సేవా సమితి వారు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా డిసెంబర్ 12వ తేదీన గూడెం గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమా చారి చేతుల మీదుగా మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం కన్నుల పండగ నిర్వహించడం జరుగుతుందని గురు స్వామి మర్రి (షిరిడి) మల్లేశం అన్నారు అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో మండలంలోని మాలాధారణ స్వాములు పాలుపంచుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు..
అలాగే దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని భక్తులందరూ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించాలని కోరారు.