
Pochamma Bonalu.
నేడు ఆషాఢం పోచమ్మ బోనాలు
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం రోజున ఘనంగా అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాల పండగ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవంతంగా ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరం అని,ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తామని అన్నారు.అలాగే నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు ఆడపడుచులు ఎత్తుకున్న బోనాలతో,డప్పు చప్పులతో, ఆటపాటలతో,పోతరాజుల వేషధారణలో భక్తులు చేరుకొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించడం జరుగుతుందని అన్నారు.మహిళలు,భక్తులు ఆషాడ బోనాల ఉత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహంకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ కోరారు.