
Tobacco Free Youth Campaign Launched in Hanumakonda
టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్
#హనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
హన్మకొండ, నేటిధాత్రి (మెడికల్):
టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0 లో భాగంగా నేటి నుండి డిసెంబర్ 8 వరకు 60 రోజులు యువతను లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని
హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలియచేసారు.ఈ రోజు ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వడ్డేపల్లి లో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. అలాగే పొగాకు వినియోగంపై అవగాహన కార్యక్రమము, అలాగే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు అయినటువంటి గుట్కా, కైని, జర్ధ ,సిగరెట్, చుట్ట,బీడీ, పాన్ మసాలాలు వినియోగించడం వలన వచ్చే అనారోగ్య సమస్యలు నోరు, గొంతు, ప్రేగు, ఊపిరితిత్తులు, గుండె మొదలగు వాటికి మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అంతేకాకుండా ఆడ మగ వ్యత్యాసం లేకుండా మరీ ముఖ్యంగా యువకులు ఎక్కువగా వీటికి అలవాటు పడుతున్నారు అలాగే ప్రజలు పొగాకు మరియు పొగాకు సంబంధించిన ఉత్పత్తులకు దూరంగా ఉండి మీ విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోరడం జరిగింది. అలాగే 60 రోజులు జరిగే ఈ ప్రోగ్రాము ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలో, పాఠశాలలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, నిర్వహించాలని, పాఠశాల ఆవరణలో వంద గజాల దూరంలో పొగాకు సంబంధించిన షాప్స్ ఉండకుండా చూడాలని, బహిరంగ ప్రదేశంలో ఎవరు ఈ ఉత్పత్తులను వినియోగించకూడదని సూచించారు.రాలీ అనంతరం ఎన్జీవోస్ కాలనీ కూడలిలో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్ సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, వైద్యాధికారి డాక్టర్ మాలిక జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, సోషల్ వర్కర్ నరేష్, హెల్త్ సూపర్వైజర్ గోవర్ధన్ రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్ మానస హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎంలు ఆశాలు స్థానిక యువకులు పాల్గొన్నారు.