
Tobacco Free School
మంగపేట లో టొబాకో ఫ్రీ స్కూల్ ఛాలెంజ్ ర్యాలీ
మంగపేట నేటిధాత్రి
పొగాకు రహిత సమాజాన్ని సృష్టించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని మంగపేట మండల విద్యాశాఖ అధికారి మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పొదేం మేనక అన్నారు.
పొగాకు వాడడం వల్ల కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన పెంపొందించుకొని దానిని నిర్మూలించడానికి ప్రతి
ఒక్కరూ కృషి చేయాలని,వీటిపట్ల విద్యార్థులకు అవగాహన పెంపొందించడానికి విద్యార్థులచే గ్రామంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిగరెట్లు,బీడీలు,తంబాకు, గుట్కాలు వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ,దీనికి సంబంధించి అవగాహన కోసమై విద్యార్థులచే పోస్టర్లు కూడా తయారు చేయించడం జరిగింది.అంతేకాక గ్రామంలో చౌరస్తా నందు విద్యార్థులు ఒక చక్కని వీధి నాటకం ప్రదర్శించి పొగాకు వాడటం పట్ల కలిగే హానికర పరిణామాలు గూర్చి అవగాహన పెంపొందించడం జరిగింది.తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు ,విద్యార్థులు అందరూ కలసి పొగాకు రహిత సమాజం కోసం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు క్రాంతి,మాధురి దేవి,నాగేందర్ ,వెంకటేశ్వర్లు,
వెంకటేశ్వర్ రెడ్డి,
నాగేందర్,సతీష్,చంద్రశేఖర్,
నరసింహరావు మరియు విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.