
Corporation Chairman N. Giridhar Reddy
ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో
◆ పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి*
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రజా సమస్యల పరిష్కారానికై టీపీసీసీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది.అందులో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారిని నియమించారు.వారు శుక్రవారం 20/06/2025,ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించారు.అనంతరం సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గాంధీ భవన్లో ప్రజల సమస్య లకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామన్నారు.ఈకార్యక్రమంలో తెలంగాణ ఫిషరిస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు.సాయి కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.