Tirupati Sub Junior Tennikoit Selections
*సబ్ జూనియర్ టెన్నికాయిట్ తిరుపతి జిల్లా జట్ల ఎంపికలు..
తిరుపతి(నేటిధాత్రి)నవంబర్
తిరుపతి జిల్లా టెన్నికాయిట్ సబ్ జూనియర్ బాల బాలికల జిల్లా జట్ల ఎంపికలు తేదీ 16/11/25 ఆదివారం ఉదయం 10 గంటలకు డి ఆర్ డబ్ల్యు కళాశాల గూడూరు నందు జరుగునని తిరుపతి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు (మయూరి శ్యామ్ యాదవ్) తెలిపారు.
ఈ ఎంపికకు హాజరగు విద్యార్థినీ విద్యార్థులు 01 /01 /2011 తేదీన గాని తర్వాత గాని జన్మించిన వారై ఉండవలెను, విద్యార్థిని విద్యార్థులు వెంట పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకొని రావలెను అని తిరుపతి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బండి శ్యామసుందరరావు,కార్యదర్శి గెరిటి చెంచయ్య ఒక ప్రకటనలోతెలియజేశారు.
