· సీబీఐ‘సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసినతర్వాత కూడా ఇది అవసరమా?
· లడ్డూపై అనవసర పిటిషన్లు దాఖలు చేయొద్దన్న సుప్రీం కోర్టు
· జంతు కొవ్వు లేదని సీబీఐ తేల్చిన తర్వాత కూడా ఇంకా రాజకీయమంటే ఏలా?
· తిరుమలలో అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు
· మరింత కఠినంగా నెయ్యి సేకరణ నిబంధనలు
· కర్ణాటక పాల సమాఖ్యకే తిరిగి నెయ్యి సరఫరా అప్పగింత
· ఒక్క దేవాలయ సమస్యను సాగదీస్తే ఓట్లు రాలతాయా?
· రాజకీయం బూమరాంగ్ అయితే నిండా మునగడం ఖాయం
· అతి రాజకీయాలు అనర్థ దాయకం
· రాష్ట్రాభివద్ధిపై దష్టి పెట్టాలి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేరే అంశమే లేనట్టు తిరుపతి లడ్డూ చుట్టూనే ఇవి తిరుగుతుండటం విచిత్రమనిపిస్తోంది. ముఖ్యంగా హిందువుల మనోభావాలను కేవలం హిందూ నాయకులే దెబ్బ తీసేలా వ్యవహరిస్తుండటం బాధాకరంగా పరిణమిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనందంతో తన్మయత్వంలో మునిగిపోతారు. తిరుమ ల అంటేనే ఒక విధమైన అలౌకిక ఆనందం కలుగుతుంది. ఇన్ని వందల సంవత్సరాల కాలం లో ఎన్నో పరిణామాలు జరిగినా చిద్విలాసంగా శ్రీవేంకటేశ్వరుడు కలియుగ ధర్మాన్ని వీక్షిస్తూ దుష్టులను శిక్షిస్తూ సద్వర్తనులను కాపాడుతూ అందరికీ ఇలవేల్పుగా వెలుగుతున్నారు. అటువంటి స్వామివారి ఆలయాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి రచ్చరచ్చ చేస్తూ, స్వప్రయోజనాలు కాపాడుకునే కుచ్చిత వ్యవహారశైలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతోంది. రాజకీయ ఆధిపత్య వైకుంఠపాళిలో భక్తులు అతిపవిత్రమైన స్వామివారి ప్రసాదంగా భావించే లడ్డూను బజార్లో కి లాగి యదేచ్ఛగా దాని నాణ్యతను, దానిపై భక్తులకున్న అచంచల నమ్మకాన్ని, భక్తి ప్రపత్తులను సమూలంగా దెబ్బదీసే ఈ హనన రాజకీయాలు హిందువుల హదయాలను శూలాలుగా తొలిచేస్తున్నాయి. రాజకీయాలు చేయడం సహజమే కానీ, మరీ ఇంతటి నీచంగా భక్తుల మనోభా వాలను దెబ్బతీసే విధంగా అవి దిగజారిపోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఒక ఆట లో క్రీడాకారుల సామర్థ్యంపై విజయావకాశాలుంటాయి. కొన్ని సందర్భాల్లో చిన్న పొరపాట్లు టీమ్ ఓటమికి కారణమవుతుండటం కూడా మనకు తెలుసు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా గెలుపోటములు సహజం. నాయకుడి పనితీరును బట్టే ప్రజలు ఓట్లేస్తారు తప్ప, అసమర్థ నాయకుడిని ఏరికోరి ఏ ఓటరు తన నెత్తిన పెట్టుకోవడానికి ముందుకు రాడు. ఈ నేపథ్యంలో అధికారం లో ఎవరు వున్నా, తమ పనితనాన్ని చూపి ప్రజల మనసును గెలుచుకోవాలి తప్ప, వారి సెంటిమెంట్‌ను బలంగా దెబ్బకొట్టి ఓటర్లను తనకు అనుకూలంగా మలచుకోవాలనుకోవడం అత్యంత దారుణ రాజకీయమని చెప్పక తప్పదు.
ప్రజాప్రతినిధులు ఈ లడ్డూ విషయమై బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం తాజా పరిణామం. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లడ్డూలో ఏముందో తమకు తెలుసంటూ వాదించిన పిటిషనర్లపై కోర్టు అసహనం వ్యక్తం చేయడమే కాదు, “మీరేమైనా నిపుణులా? మీకు తెలిసిన సమాచారం నేరుగా సీబీఐకి ఇవ్వండి. కోర్టులో పిటిషన్లు వేయకండి” అంటూ చురకలు అంటించింది. ఇదే సమయంలో ఈ కేసుపై క్రిమినల్ విచారణ, దినేష్ కుమార్ కమిటీ నిర్వహించే పాలనాపరమైన వి చారణ కొనసాగవచ్చని స్పష్టం చేసింది.
గతంలో ఈ లడ్డూ కేసులో విచారణ జరిపిన సీబీఐ సిట్ ఇందులో జంతు కొవ్వు కలవలేదని స్పష్టం చేసింది. కాకపోతే పామాయిల్ వంటి వెజిటబుల్ ఆయిల్స్ కల్తీ జరిగిందని పేర్కొంటూ 36 మందిని దోషులుగా గుర్తించింది. వీరిలో టీటీడీ ఉద్యోగులు, డైరీ యజమానులు వున్నారు. వీరిపై నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. ఈవిధంగా కేసు ఒక కొలిక్కి వ చ్చిన తర్వాత కూడా దీన్ని పట్టుకొని వేలాడుతూ, ఓట్ల రాజకీయాన్ని చేయడం రాజకీయ నాయకులకు ఎంతమాత్రం సమంజసం కాదు. నిజానికి లడ్డూ వివాదంపై క్రిమినల్ సీబీఐ`సిట్ నిర్వహించిన క్రిమినల్ విచారణ ముగిసిపోయింది. జంతుకొవ్వు కలవలేదని తేలడంతో నెయ్యి సేకరణలో వైఫల్యం, ఆర్థిక అవకతవకల పై సీబీఐ విచారణలో దష్టి కేంద్రీకరించింది. నిజానికి ల డ్డూలో జంతువుల కొవ్వును కలుపుతున్నారని, ఇది వైఎస్సార్సీపీ హయాం నుంచే మొదలైందని చంద్రబాబు 2024లో ఆరోపించిన దగ్గరినించి వివాదం మొదలైంది. తర్వాత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) జరిపిన విచారణలో, టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో ఇతర కొవ్వు పదార్థాలు న్నాయని సూచించడంతో వివాదం ముదిరింది. టీటీడీ ఇందుకు ప్రక్షాళనగా ఏకంగాశాంతి ీVAమం వంటివి నిర్వహించింది. తర్వాత సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ`సిట్ విచారణలో పామాయిల్, పామోలిన్, రసాయన పదార్థాలున్నాయని తేలింది తప్ప జంతు కొవ్వు కలవలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం జంతుకొవ్వు అన్న అంశం నుంచి రూ.234.5కోట్ల ఆర్థిక అవకతవకల కిందికి మారిపోయింది. ఇందులో టీడీటీ అధికార్లు, డైరీ సరఫరా దా ర్ల పాత్ర వైపునకు విచారణ మళ్లింది. సుమారు 68లక్షల కిలోల తక్కువ ప్రమాణాల నెయ్యిని సరఫరా చేసిందన్న ఆరోపణలపై ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు, టీటీడీ అధికార్లతో కలిపి 36మందిపై సిట్ చార్జ్‌షీటు దాఖలు చేసింది. ఈ స్కామ్‌కు సంబంధించి ఈమద్యనే ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ‘ప్రివెంటివ్ ఆప్ మనీలాండరింగ్ యాక్ట’ కింద కేసు నమో దు చేయడం గమనార్హం.
ఈ పరిణామాల తర్వాత తిరుమలలో రూ.25కోట్ల వ్యయంతో అత్యాధునిక ‘ఫుడ్ టెస్టింగ్ ల్యాబ’ను ఏర్పాటు చేశారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి తగిన ప్రమాణాలతో వున్నదీ లేనిదీ ఈ ల్యాబ్‌లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. టీటీడీ ఒక ‘సెన్సరీ ప్యానల’ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్ లడ్డూ సువాసనను, రుచిని పరీక్షిస్తుంది. దీనికి తోడు నెయ్యి సేకరణ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. టీటీడీ ఇప్పుడు మళ్లీ నెయ్యి సరఫరా బాధ్యతను తిరిగి ‘కర్ణాటక పాల సమాఖ్య’కు (నందిని ఘీ) అప్పగించింది.
ఇన్ని చర్యలు తీసుకున్న తర్వాత, మరోవైపు సీబీఐ`సిట్ చార్జ్‌షీటు దాఖలు చేసిన తర్వాత కూడా ఇంకా ‘జంతుకొవ్వు’ భజన చేయడం తుచ్ఛరాజకీయం తప్ప మరోటి కాదు. సుప్రీంకోర్టు ధర్మా సనం, “మీరు నిపుణులా?” అని ప్రశ్నించడం కీలకం. ఈవిధంగా ఆరోపించేవారు తగిన ఆధారాలతో సీబీఐకి సమాచారం అందించవచ్చునని స్పష్టం చేసి, కేసును ముగించడం, న్యాయపరంగా దీనికి ముగింపు పలికినట్లయింది. ప్రభుత్వం నాలుగు కోట్లమంది తెలుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. కేవలం ఒక దేవాలయంలో ఎదురైన సమస్యను అదికూడా పరిష్కరించిన త ర్వాత కూడా రాష్ట్రంలో మరే సమస్య లేనట్టు దాన్నే పట్టుకు వేలాడుతూ రాజకీయం చేయాలను కోవడం సమర్థనీయం కాదు. అధికారంలో వున్న పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేసే డైవర్షన్ రాజకీయాలు తప్ప మరోటి కాదనుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికార, విపక్ష పార్టీలు బాధ్యతాయుత రాజకీయాలతో రాష్ట్రాన్ని అభివద్ధి పథంలోకి తీసుకెళ్లేలా చూడాలి తప్ప, చిన్న సమస్యను పట్టుకొని వేలాడుతూ కాలయాపన చేయడం తగదు.
ధార్మికతకు, సనాతనధర్మ పరిరక్షణకు కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఎన్ని ఆరోపణలు వచ్చినా హిందువుల్లో వున్న సహనశీలత, శ్రీవారిపై వున్న అనన్యమైన భక్తి ప్రేమల వల్ల టీటీడీ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వైభవోపేతమైన దేవస్థానంగా పరిగణించబడుతోంది. అంతటి ఆదాయం కలిగి, ప్రపంచ వ్యాప్తంగా భక్తులను, విరాళాలను ఆకర్షిస్తున్న ప్రముఖ ధార్మిక కేంద్రమైన తిరుమలను అపవిత్రం చేయడానికి, ప్రాభవాన్ని దెబ్బతీయడానికి ఎన్నోశక్తులు ప్రయత్నిస్తూనే వుంటాయి. కానీ దివ్యమైన శ్రీవారి క రుణా వీక్షణాలు ఆయన భక్తులను ఎప్పుడూ కాపాడుతూనే వుంటాయి. అటువంటి పెద్దాయనతో పెట్టు కున్నవారు, భక్తులను దోచుకోవడమే కాకుండా, పవిత్రక్షేత్రంలో అక్రమాలకు పాల్పడిన వారు భయంకరమైన కష్టనష్టాలకు గురైన సంఘటనలు ఎన్నో. చేసిన పాపాన్ని బట్టి కష్టాలభా రం అను భవిస్తున్నవారి ఉదంతాలను తిరుమలలోని స్థానికులు చెబుతున్నప్పుడు వింటే స్వామి వారి మహత్మ్యం స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని అర్థం చేసుకున్నవారు భక్తినే నమ్ముకుంటారు. అక్రమాలకు పాల్పడేవారిని భగవంతుడైనా క్షమిస్తాడేమో కాని, కర్మ మాత్రం వదిలిపెట్టదు. ఇది చాలా కఠినమైంది. అంతకుదగ్గ ఫలితాన్ని ఇవ్వక మానదు. ఈ సత్యం తెలిసినవాడు వత్తిలా వెలుగుతాడు, తెలియనివాడు బూడిదైపోతాడు.
