మరో అయోధ్యగా మారనున్న తిరుపరన్‌కుండ్రం ఆలయ వివాదం
తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు
ప్రజలకు సెంటిమెంట్ పెరిగితే డిఎంకె అధికారానికి ముప్పే
సెంటిమెంట్ సునామీని నాస్తికవాదం ఎదురొడ్డటం కష్టం
హిందువులపై కఠినచర్యలు ప్రభుత్వానికి ఆత్మహత్యా సదృశమే
హైదరాబాద్,నేటిధాత్రి:
బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని, ఒక ప్రాంతానికే పరిమితమైనవని భావించే కొన్ని సంఘటనలు ఒక్కసారి విస్ఫోటం చెంది చరిత్రగతిని మార్చిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. అయితే అవి కొన్ని వర్గాల విశ్వాసాలను ప్రభావితం చేసేవిగా వుంటే వాటి పరిణామం చాలా తీవ్రం గావుంటుందనేది అక్షరసత్యం. ఇందులో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజలే నాయకులుగా తమ విశ్వాసాలను కాపాడుకుంటారు. ఇప్పుడు తమిళనాడులో సరిగ్గా ఇదే జరుగు తోంది. ఇప్పటివరకు దేశంలోని ఇతర ప్రాంతాలకు పెద్దగా పరిచయంలేని తిరుపరన్‌కుండ్రం మురుగన్ దేవాలయం వివాదం ఒక్కసారిగా పతాక శీర్షికలకెక్కింది. ఉత్తరాదిలో అయోధ్య ఉద్యమంలాగా దక్షిణాది రాజకీయాలను సమూలంగా మార్పుచేసే దిశగా ఈ ఉద్యమం రూపుదిద్దు కుంటుందేమోనని తమిళనాడు డి.ఎం.కె.సర్కార్ భయపడుతోంది. పూర్తి నాస్తిక వాదులుగా చె ప్పుకునే డి.ఎం.కె నాయకులు ఎన్నికలప్పడు మాత్రం మురుగన్ దేవాలయాల చుట్టూ తిరిగి, వేలాయుధాన్ని చేతుల్లో పట్టుకొని ఫోటోలకు ఫోజులిస్తూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. కానీ ద్రవిడవాదం ముసుగులో మైనారిటీల బుజ్జగింపు, హిందువుల పట్ల వివక్ష కొనసాగిస్తూరావడం వీరి ప్రవృత్తి. దక్షిణాది రాజకీయాలను ఇప్పుడు తిరుపరన్‌కుండ్రం ప్రభావితం చేయనున్నదని ద్రవిడవాదాన్ని భుజాన వేసుకున్న డి.ఎం.కె నాయకులే చెబుతున్నారు. తిరుపరన్‌కుండ్రం దేవాలయ వివాదం తమిళనాడు వ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం కలిగిస్తే తమ పుట్టి మునగడం ఖా యమనివారు భయపడుతున్నారు. ఫిబ్రవరి 4న మదురైలోని పాలంగనాథమ్ కూడలివద్ద ఈ ఆలయవివాదంపై 50 హిందూ సంస్థల ఆధ్వర్యంలో పెద్ద నిరసన ప్రదర్శన జరిగింది. లక్షలాది మంది స్వచ్చందంగా ఈ నిరసనలో పాల్గనడం ఇప్పుడు డి.ఎం.కె. ప్రభుత్వానికి మింగుడు పడటంలేదు. ముఖ్యంగా వేల సంవత్సరాలకాలంగా తిరుపరన్ కుండ్రం కొండపై మురుగన్ దేవాలయం వుంది. ఇప్పుడు ఈ కొండను కొందరు ఇస్లామిస్టులు తమకు చెందినదిగా వాదిస్తుండ టం ఉద్రిక్తలకు కారణమవుతోంది. ప్రస్తుతం ఈ వివాదాన్ని తమిళనాడు వ్యాప్తంగా ఉధృతం చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ ముందుకెళుతోంది. మరో ఏడాదిన్నర కాలంలోగా తమిళనాడులో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో స్కంధమలై వివాదం డిఎంకె మెడకు ఉరితాడు కాబోతున్నదా లేక పూలహారం కాబోతున్నదా అనేది కాలమే చెబుతుంది.
అసలు వివాదమేంటి?
2024 డిసెంబర్ చివరివారంలో మలైయదిపట్టికి చెందిన సయ్యద్ అబు దహీర్ (53) అనే వ్యక్తితన కుటుంబంతో సహా దర్గావద్దకు మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చాడు. ఒక గొర్రె, రెండు కోడిపుంజులను ఇక్కడ బలివ్వడానికి తనతో కూడా తీసుకువచ్చాడు. అయితే కొండ దిగువభా గంలో పోలీసులు వారిని అడ్డుకొని, జంతువులను బలివ్వడానికి పైకి తీసుకెళ్లకూడదని చెప్పారు.సరిగ్గా అప్పుడే స్థానిక 20 ముస్లిం కుటుంబాలు అక్కడికి చేరుకొని, సయ్యద్ అబు దహీర్‌కు మద్దతుగా నిరసనకు దిగారు. జంతువులను బలిచ్చి, వాటి మాంసాన్ని వండుకొని తినడం తమ సంప్రదాయమని వారు వాదించారు. ఇందుకోసం ఒక ఫిర్యాదు ఇచ్చినట్లయితే తగిన నిర్ణయం కోసం ప్రభుత్వానికి పంపుతామని అధికార్లు నచ్చజెప్పినా వారు వినకుండా తమ నిరసనను కొ నసాగించారు. చివరకు పోలీసులు ఆ జంతువులను తెచ్చినవారితో సహా పదిమందిని అదుపులోకి తీసుకొని తర్వాత విడుదల చేశారు. అయితే ఈ సంఘటన ఈ ప్రాంతంలో ఉద్రిక్తలకు దారి తీసింది. ముస్లింలెవరూ బలివ్వడానికి కొండపైకి తీసుకెళ్లడానికి వీల్లేదని జనవరి 22న మదురై పోలీసులుకచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. వండిన మాంసాన్ని తీసుకెళ్లి దర్గావద్ద భుజించవ చ్చునని వారు స్పష్టం చేశారు. ఆ తర్వాత కొండపై కొందరు వ్యక్తులు మాంసాహారాన్ని తింటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్లీ వివాదం రగిలింది. ఈ నేపథ్యంతో తమిళనాడులో బలంగా వున్న హిందూ మున్నాని సంస్థ తిరుపరన్ కుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద ఫిబ్రవరి 4ననిరసన ప్రదర్శనలుచేపట్టాలని నిర్ణయించింది. అధికార్లు ఇందుకు అనుమతినివ్వలేదు సరికదా ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలో నిషేధాజ్ఞలు విధించారు. దీంతోమదురై ప్రాంత హిందూమున్నాని గ్రూపు ప్రధాన కార్యదర్శి ఎస్. కళానిధిమారన్ మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై బెంచ్‌కు ఒక పిటిషన్ దాఖలు చేస్తూ ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3గంటలనుంచి రాత్రి 9.45 గంటలవరకు ‘‘16 కాల మండపం’’ వద్ద తాము నిర్వహించ తలపెట్టిన నిరసనకుఅనుమతినివ్వాలని అభ్యర్థించారు. హైకోర్టు బెంచ్ ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని పాలంగనాథమ్ కూడలివద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యకాలంలో నిరసనలు తెలుపుకోవడానికి అనుమతించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేయకూడదని కోర్టు హెచ్చరించింది. అనుకున్న ప్రకారమే లక్షలాది హిందువులు పాలంగనాథమ్ కూడలివద్ద తమనిరసనలనుతెలియజేశారు. కాగా ఈ నిరసరన ప్రదర్శనల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, హిందూ ము న్నాని, హిందూ ఫ్రంట్, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గన్నారు.తిరుపరన్ కుండ్రం కొండను ఇస్లామీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా వీరు నినా దాలిచ్చారు. ఈ నిరసన ప్రదర్శన సాయంత్రం ఆరుగంటలకు ముగిసింది. ఈ సందర్భం గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమిళనాడు ప్రభుత్వం సుమారు నాలుగువేలమంది పోలీసులను మోహరించింది.
డీఎంకే వర్సెస్ బీజేపీ
ప్రస్తుతం ఈ ప్రదర్శన వివాదంపై తమిళనాడులో డిఎంకె వర్సెస్ బీజేపీ రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడులో హిందూ ముస్లింలు సహోదరుల్లాగా మెలుగుతున్నారని, బీజేపీ మత విద్వేసాలను రెచ్చగొడుతున్నదంటూ రాష్ట్ర హిందూ రిలిజియస్ అండ్ చారిటీస్ ఎండోమెంట్ మంత్రి పి.కె. శేఖర్‌బాబు ఆరోపించారు. 1931నాటి బ్రిటిష్ ప్రీవీ కౌన్సిల్ ఇచ్చిన తీర్పుతో పా టు ప్రస్తుతం 2023 నుంచి రెండు కేసులు కోర్టులో పెండిరగ్‌లోవున్న విషయాన్ని గుర్తుచేశారు.తమ ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై ర్యాలీ శాంతియుతంగా జరిగిందని, ఎక్కడా అల్లర్లు లేదా బస్సు దహనాలు, వి ధ్వంసం వంటివి చోటుచేసుకోలేదన్న సంగతిని గుర్తుచేశారు. 1931నాటి బ్రిటిష్ ప్రీవీ కౌన్సిల్ హిందువులకు అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతిని గుర్తుచేస్తూ, (అప్పటి ప్రీవీకౌన్సిల్ కొండపై మాంసాహారాన్ని వండటం, తినడం, జంతువుల బలి ఇవ్వడం నిషేధమని స్పష్టంగా తీర్పు చె ప్పింది. స్వాతంత్రానంతరం ద్రవిడ ప్రభుత్వాలు కొండపైకి మాంసాన్ని తీసుకెళ్లడాన్ని అనుమతి స్తూ వచ్చాయి) ప్రభుత్వం అసలు విషయాన్ని మరుగున పరచవద్దని చురకలంటించారు. ర్యాలీ లో పాల్గనకుండా తమిళనాడు వ్యాప్తంగా 350ప్రదేశాల్లో బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారని, ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. రామనాథపురం ఎం.పి. నవాజ్‌ఖని గ్రూపుకు చెందినవారే ఈ వివాదానికి కారణమని ఆయన ఆరో పించారు.అయితే ఖని ఈ ఆరోపణలను ఖం డిరచారు.ఇదిలావుండగా కలెక్టర్ ఎం.ఎస్. సంగీత మాట్లాడుతూ, స్థానిక ప్రజలు శాంతియుతంగానే వున్నారని, బాహ్య శక్తులవల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఆలయం ఎగువన కొండపై వున్న దర్గావద్ద ‘కందూరి’ (జంతుబలి)కి అనుమతినివ్వాలని గతంలో రెండు సార్లు ముస్లింలు కోరినా అందుకు అనుమతించలేదన్న సంగతి గుర్తుచేశారు. మాతా నల్కినక్క అమైప్పుగళ్(మతసామరస్యానికి కృషిచేస్తున్న గ్రూపు) సంస్థ మతసామరస్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు అప్పీల్ చేసింది. కాగా అడ్వకేట్ ఎస్. ముత్తుకు మార్, 2012లో కొండపైబాంబులు దొరికిన కేసుతో సహా జంతుబలి, మాంసాహర సేవనానికి సంబంధించిన అన్ని కేసులను ఎన్.ఐ.ఎ.కు బదిలీచేయాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు. ఇక బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మహణ్యస్వామి మాట్లాడుతూ కొండపైనుంచి దర్గానుమరో ప్రదేశానికి తరలించడమే సమస్యకు పరిష్కారమన్నారు. నమాజ్ ఎక్కడైనా చేయవచ్చునని, ప్రజాప్ర యోజనార్థం ప్రభుత్వం మసీదులను వేరేచోటికి తరలించడానికి లేదా కూలగొట్టడానికి షరియాచట్టం అనుమతిస్తుందన్న సంగతిని గుర్తుచేశారు. అంతేకాదు దర్గాను ఎక్కడికి తరలి స్తే బాగుంటుందో సలహా ఇచ్చే బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించాలని కూడా ఆయన కోరారు. రామనాథపురం ఎం.పి. నవాజ్‌ఖని మాట్లాడుతూ ‘దశాబ్దాలు గా ముస్లిం భక్తులు గొర్రెలు, మేకలు, కోళ్లను కొండపైకి తీసుకెళ్లి బలిస్తుండటం కొనసాగుతోంది. వండిన మాంసం తీసుకెళ్లడమనేది కేవలం తాత్కాలిక ఆదేశాలు మాత్రమే. నేను మదురై పోలీసులతో మాట్లాడతాను. అదీకాకుండా కొండ పై ఉన్న ఈ దర్గా వక్ఫ్ ఆస్తి’ అని స్పష్టం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ముస్లింలు ఈ కొండపేరును ‘‘సికిందర్ మలై’’గా మార్చాలన్న తమ డిమాండ్‌ను మళ్లీ పైకి తీసుకొచ్చారు.
తిరుపరన్‌కుండ్రం చరిత్ర
తిరుపరన్ కుండ్రం లేదా తిరుప్పరన్ కుండ్రం దేవాలయం మదురై నగరానికి సమీపంలో వుంది. మదురైలోని పెరియార్ సెంట్రల్ బస్టాండ్‌కు సరిగ్గా ఏడుకిలోమీటర్ల దూరం. తిరుపరన్‌కుండ్రం 1028 అడుగుల ఎత్తైన ఏకశిలతో ఏర్పడిన కొండ. ఈ పర్వతాన్ని హిందువులు అతి పవి త్రమైనదిగా పరిగణిస్తారు. ఇక్కడ ప్రాచీన శైవమతానికి చెందిన గుహలున్నాయి. ఈ కొండను హిందువులు ‘స్కందమలై’గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో శైవం ప్రాచుర్యంలో ఉన్న కాలంలో క్రీ.శ.7 నుంచి క్రీ.శ15వ శతాబ్దం మధ్యకాలంలో ఈకొండ ఉత్తరభాగంలో మండపాలు, ఆలయాలను పలు హిందూ రాజవంశాలు నిర్మించాయి. ఆవిధంగా నిర్మితమైన అతిపెద్ద దేవాయలయ సముదాయం తిరుపరన్‌కుండ్రం మురుగన్ ఆలయంగా ప్రసిద్ధిపొందింది. తమిళనాడులోని ఆరు ప్రముఖ మురుగన్ దేవాలయాల్లో (అరుపడై వీడు) దీన్ని మొట్టమొదటిగా పరిగణిస్తారు. మదురై వెళ్లినవారు మీనాక్షి అమ్మవారి దర్శనం తర్వాత తప్పకుండా ఈ మురుగన్ ఆలయాన్ని దర్శిస్తారు. ఇదే కొండ పై క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీ॥శ. 2వ శతాబ్దం మధ్యకాలం నాటి జైనుల తమిళ బ్రహ్మీలిపి శాసనాలు కూడా ఇక్కడ వున్నాయి. కొండకు దక్షిణాన సరస్వతీ తీర్థం వుంది. ఇక్కడే తిరుప్పరన్‌కుండ్రం రాతి గుహాలయాలున్నాయి. ఇక్కడ ప్రాచీన జైనదేవాలయాన్నే క్రీ॥శ ఏడవ శ తాబ్దంలో శివాలయంగా మార్చి, 13వ శతాబ్దం నాటికి దీన్ని పూర్తిగా విస్తరించారని చెబుతారు. కొందరు హిందువులు ఈ కొండచుట్టూ ప్రదక్షిణం చేయడం సర్వపాపాలను హరిస్తుందని నమ్ముతారు.
ఢల్లీి సుల్తానులు తిరుపరన్‌కుండ్రరామదురై ప్రాంతాల్లో లూటీలుాదహనాలకు పాల్పడి విచ్చల విడి విధ్వంసం సృష్టించారు. 14వ శతాబ్దం తర్వాత తమిళనాడులో ఇస్లామిక్ సుల్తానేట్‌ను ఏ ర్పాటు చేయాలని ఢల్లీి సుల్తానులు ప్రయత్నించారు. దీన్నే మదురై సుల్తానేట్‌గా వ్యవహరించారు.అయితే ఈ సుల్తానేట్ ఎక్కువకాలం మనుగడలో లేదు. ఈ సుల్తానేట్‌కు చెందిన చివరి పాలకుడు సికిందర్ షా అతని సైనికాధికార్లను 1377లో విజయనగర రాజులు తిరుపరన్‌కుండ్రమ్‌లో వధించి, వారి పాలనకు అంతం పలికారు. అయితే సికిందర్ షాకు ఇక్కడ సమాధిని నిర్మించు కోవడానికి విజయనగర పాలకులు అప్పట్లో అనుమతించారు. దీంతో ఈ సమాధి నిర్మాణం తి రుపరన్ కుండ్రం ఉత్తరభాగంలో 14, 15శతాబ్దాల్లో జరిగింది. క్రమంగా 17, 18 శతాబ్దాల కాలంలో ముస్లింలు ఈ సమాధిని క్రమంగా దర్గాగా మార్పుచేసి మరింత విస్తరించారు. దీన్నే ఇప్పుడు తిరుపరన్‌కుండ్రం దర్గా అని పిలుస్తున్నారు.
కార్తీకదీపానికీ అనుమతి లేదు
ఇక్కడ కాశీవిశ్వనాథర్ దేవాలయం వద్ద వున్న స్థూపంపై కార్తీకదీపాన్ని పెట్టే సంప్రదాయానికి అనుమతివ్వాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధకాలానికి ముందు వరకు ఇక్కడి స్థూపంపై కార్తీకదీపం పెట్టేవారు. ఆ యుద్ధకాలంలో దీపం పెట్టడం కొన్ని కారణాలవల్ల నిలిచిపోయింది. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న కారణంగా తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ దీపం పెట్టడానికి అనుమతించలేదు. మరెక్కడైనా పెట్టుకోవచ్చని చెప్పినా అది ఆగమశాస్త్ర విరుద్ధమని హిందువుల వాదన. అయితే ఈ విశ్వనాథర్ దేవాలయానికి వెళ్లే దారిలో నమాజ్‌లు చేసిన సంఘటనలు కూడా పెరిగాయి. ఆవిధంగా ఆలయానికి వెళ్లే దారిలో నమాజ్‌లు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వడానికి మద్రాస్ హైకోర్టు ఇటీవల తిరస్కరించింది. ఇదిలావుండగా, క్రమంగాకొండపై ఆక్రమణలు పెరుగుతున్నాయని హిందువులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా శివగంగలోని కరైక్కుడికి చెందిన అన్నానగర్‌ల ఫిబ్రవరి 3న జరిగిన ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో కొందరు ముస్లిం మహిళలు పాల్గనడం విశేషం. ‘‘లలితా ముత్తుమారియన్ ములైకొట్టు తిన్నై’’ దేవాలయంలో ‘‘సీర్‌వారిసై’’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గనడం వీరికి హిందువులు ఆహ్వానం పలకడం కొసమెరుపు!