మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల పరిధిలోని చోక్కంపేట్ గ్రామంలో మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని సోమవారం రోజున ఉమ్మడి దొండ్లపల్లి గ్రామ పంచాయితీలో స్వయంభూ వెలసిన శ్రీశ్రీశ్రీ తిరుమలనాథ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బండ్ల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి ని బ్యాండ్ బాజాలతో, బాణసంచాలు పేల్చుతు అభిమన్యు రెడ్డి కి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం అభిమన్యు రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, చల్లగా వర్ధిల్లాలి అని ఆ బంగవంతుణ్ణి కోరడం జరిగింది అని తెలిపారు.
అనంతరం గ్రామస్తులు అభిమన్యు రెడ్డి కి శాలువతో పూల మాలతో ఘనంగా సన్మానించారు. భక్తులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈకార్యక్రమంలో సర్పంచులు కృష్ణయ్య, సేవ్య నాయక్, లక్ష్మీదేవి రంజిత్ గౌడ్, ఉప సర్పంచ్ నిలమ్మ, గ్రామ కో ఆప్షన్ అజీమోద్దీన్, వార్డు మెంబెర్స్ మంచాల జ్యోతి, మంచాల కమలమ్మ, బోయ రాజు, యువసేన నాయకులు మంచాల మల్లేష్, శ్రీధర్, యాదగిరి, రాజు, ఆంజనేయులు, పలువురు యువకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.