
Congress
10 సంవత్సరా లు ఎదురుచూపులతో విసిగిపోయిన కుటుంబాలకు . కొత్త రేషన్ కార్డులతో సరికొత్త వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం
భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్
మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి
* భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాలతో ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవీందర్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరుపేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అందిన కాడికి దోచుకొని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవానికి చేయూత అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికికృషి చేస్తుందన్నారు
బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రేషన్ కార్డులు నిరంతరయ ప్రక్రియని తెలిపారు పేదలకు సన్న బియ్యం అందియ్యాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని వివరించారు పది సంవత్సరాల ఎదురుచూపులతో విసుక్కుపోయిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులతో సరికొత్త వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు సీఎంఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను మంజూరు చేస్తున్నామని ప్రతి కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రజా ప్రభుత్వమని స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనికోరారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఆకినపల్లి రమేష్ మల్లయ్య గౌరవ అధ్యక్షులు మోత్కూరి మల్లయ్య ఉపాధ్యక్షులు పసునూటి సంపత్ ప్రధాన కార్యదర్శి ముప్ప రమేష్ కార్యకర్తలు కూకట్ల రాజయ్య కూకట్ల ఐలయ్య బసవోజు సత్యం బసపోజు నరేంద్ర చారి అక్క పెళ్లి రాంబాబు కూపట్ల రాకేష్ గోలి సతీష్ ఈర్ల రమేష్ ఈర్ల తిరుపతి రేళ్ళ రమేష్ ఈర్లఅశోక్ పాల్గొనడం జరిగింది