మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణిలో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ చేసే టిప్పర్ లారీలకు కాంట్రాక్టర్లు పోటీపడి తక్కువకు టెండర్లు వేయడంతో సింగిల్ టిప్పర్ లారీలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో లారీ ఓనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, లారీ ఓనర్లకు గిట్టుబాటుగా కల్పించాలని బెల్లంపల్లి టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఏరియా అధ్యక్షుడు ఐ తిరుపతి, కార్యదర్శి బంక రాజేంద్రప్రసాద్, కోశాధికారి బి సుధాకర్ రెడ్డి లు డిమాండ్ చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అసోసియేషన్ కార్యాలయాన్ని సోమవారం వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో లారీ టైర్లు, ఆయిల్, విడిభాగాల ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో లారీ ఓనర్లకు గిట్టుబాటు ధర లేక నలిగిపోతున్నారని, సరైన సమయంలో ఇఎంఐలు కట్టలేక, ఫైనాన్స్ వారి ఆగడాలు తట్టుకోలేక, ఓనర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గందె రాజయ్య, జి సత్యనారాయణ, దాసరి జనార్ధన్, కప్పల నరసయ్య, కే రాజేందర్ రెడ్డి, టీఎం ఇర్ఫాన్, ఎం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.