
ప్రశ్నించే గొంతుకకే పట్టం కట్టాలి.
పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేస్తా.
తిప్పారపు రమ్య.
రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి:-
భారత రాష్ట్ర సమితి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ మహిళా కోఆర్డినేటర్ గా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామానికి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు తిపారపు రమ్య బాబురావును నియమిస్తూ స్టేషన్గన్పూర్ మాజీ ఎమ్మెల్యే నియర్గ ఇన్చార్జి డాక్టర్ తాటికొండ రాజయ్య ఉత్తర్వులు జారీ చేశారు మంగళవారం ఆమె మాట్లాడుతూ. ఉద్యమాల గడ్డ స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలపేతం చేసేందుకు సైనికులుగా పని చేస్తానని ఆమె తెలిపారు ప్రశ్నించే గొంతుకగా నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయం కోసం ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చిందని ప్రతి కార్యకర్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆమె తెలిపారు తన నియమానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాజీ ఎంపీపీ వై కుమార్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.