
ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న-కొయ్యడ శ్రీనివాస్
పరకాల నేటిధాత్రి
ప్రజల అభిమానం గెలిచిన వ్యక్తి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిపించాలని పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోద అనిత రామకృష్ణ న్యాయవాదులను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పరకాల కోర్టు ఆవరణలో న్యాయవాదులను మున్సిపల్ చైర్ పర్సన్ సోద అనిత రామకృష్ణ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)అభ్యర్థిత్వాన్ని బలపరిచి అధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరామకృష్ణ మాట్లాడుతూ తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల గొంతెత్తి పోరాటం చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నత యమే లక్ష్యంగా పనిచేసే లక్షలాది ప్రజల గుండెల్లో కొలువై తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు.పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ఒక విప్లవ కెరటం అని ఎగసిపడే అగ్నిజాల ఉద్యమకారుడని అంతేగాక పీడిత ప్రజల పక్షాన గర్జించే సింహం అంటూ తన గొంతు ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రజలకు అండగా నిలబడే వ్యక్తిని గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేశ్వరరావు,ఎండి రంజాన్ అలీ,న్యాయవాదులు పున్నం రాజిరెడ్డి,లక్కం శంకర్,షాబిర్, వెంకటరమణ,రాజేందర్,రాజు, రాజేందర్,రమేష్,సురేష్,వేణు యాదవ్,సూర్యం,రమేష్,రఫీ, ప్రవీణ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.