– ఐనవోలు రెడ్డి సంఘం అధ్యక్షులు చింతలపూడి హరికృష్ణారెడ్డి డిమాండ్
– రెడ్డి లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఐనవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
– దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్.
నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-
హన్మకొండలో గత ఆదివారం జరిగిన బిసి యుద్దభేరి సభలో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తన ప్రసంగంలో రెడ్డి కులస్థులను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం ఐనవోలు మండల అధ్యక్షులు హరికృష్ణరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.ఒక బాధ్యత గల ఎమ్మెల్సీ పదవిలో ఉండి కులాల మధ్య చిచ్చు పెట్టి ఘర్షణలకు దారితీసే విధంగా బాధ్యతా రహిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. మల్లన్న రాష్ట్రంలోని రెడ్డి కులస్థులందరికి బేషరుతు క్షమాపణలు చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ అధిష్టానం వెంటనే మల్లన్న సభ్యత్వంను రద్దు చేసి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.