మంచిర్యాల,నేటి ధాత్రి:
రేషన్ దుకాణాల్లో సకాలంలో సరుకులు పంపిణీ చేయాలి
రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సకాలంలో సరుకులు పంపిణీ చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. దుకాణంలో లభించే సరుకులు,నిల్వలు,ధరల వివరాలు ప్రదర్శించాలని తెలిపారు.రేషన్ షాపు నంబర్, చిరునామా,మొబైల్ నంబర్ నోటీస్ బోర్డులో ఉంచాలని సూచించారు.సరుకుల పంపిణీ సమయంలో డీలర్ కచ్చితంగా ఉండాలని,ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి,నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలన్నారు.