
government school
తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ
మాజీ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో నామాల వెంకన్న 13వ వర్ధంతి సందర్భంగా టై,బెల్ట్స్,ఐడెంటి కార్డ్స్,విద్యార్థిని,విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులు అందించారు.నామాల వెంకన్న కుమారులైన నమాల సత్యవతి తిరుపతి,జ్యోతి రవి,మాధురి శ్రీనివాస్ విద్యార్థిని,విద్యార్థులకు టై, బెల్ట్,ఐడికార్డ్స్ వారి నాన్న జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా నామాల తిరుపతి మాట్లాడుతూ..మన ప్రభుత్వ పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థిని,విద్యార్థులను ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా తయారుచేసి పోటీ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాల విద్యార్థులపై నెగ్గే విధంగా తయారు చేయాలని అన్నారు.మా వంతుగా ప్రభుత్వ పాఠశాలకు ఏ అవసరమొచ్చిన సహాయం చేయడానికి ముందుంటామని తెలిపారు.అలాగే పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు నామాల సత్యవతి తిరుపతి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్ విజయ,యూత్ సభ్యులు శ్రీకాంత్, రాజకుమార్,శ్యామ్ కుమార్, శ్రీకర్,తదితరులు పాల్గొన్నారు.