-రవి వస్తేనే మునుగోడు అభివృద్ధి.
-మునుగోడు ప్రజల అభివృద్ధే రవి ధ్యేయం.
-అనేక సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు సేవలు.
-రవి ముదిరాజ్ కే ప్రజల దీవెనలు.
-ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే ఆపద్భాందవుడు.
-బలమైన ముదిరాజ్ సామాజిక వర్గ నేపథ్యం.
-మునుగోడు ఈసారి బిసిలకే…టికెట్ రవికే!
-ప్రజలంతా కోరుకుంటోంది రవినే…
-డి. ప్యాక్, నేటిధాత్రి సంయుక్త సర్వేలో తేలిందిదే.
-మెజారిటీ ప్రజలు రవి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు.
-పొరపాటున కూడా కూసుకుంట్ల వద్దంటున్నారు.
-బిసిలలో ఐక్యత సాధించే నాయకుడు రవి.
-బిఆర్‌ఎస్ నేతలు, బిసిలంతా ముక్త కంఠంతో కోరుకుంటోంది రవినే.
-మునుగోడు ముందటపడాలంటే రవే రావాలి.
-మునుగోడు అభివృద్ధి జరగాలి.
-ఇదే జనం చెప్పుకుంటున్న మాట.
-సామాన్యుల బాధలు తెలిసిన నేత రవి.
-కష్టపడి పైకొచ్చిన ఆదర్శనేత రవి.
-మునుగోడు వెలగాలంటే రవి రావాలి…మునుగోడు ప్రగతిలో దూసుకుపోవాలి.
-బిఆర్‌ఎస్ కు ఎదురులేదు…రవి నాయకత్వానికి తిరుగులేదు.
-పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే నాయకుడు రవి.
హైదరబాద్,నేటిధాత్రి:
గొప్పను గొప్పగా చెప్పాల్సిన తరుణాన్ని గొప్పగానే చెప్పాలి. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న మునుగోడు ముద్దుబిడ్డ నారబోయిన రవి ముదిరాజ్ గురించి నిజమే చెప్పాలి. నిజాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి. ఆయనకు ప్రజలంటే ప్రాణం. ప్రజా సేవ చేయడం ఇష్టం. తాను కష్టపడి సంపాది ంచిన దానిలో ఆపదలో వున్నవారిని ఆదుకునేందుకు ఖర్చు చేయడం గొప్ప గుణం. ప్రజల అవసరాలు తీర్చి, వారికి మేలు చేయడం ఎంతో ఇష్టం. తమ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ది చేయాలని ఇష్టం. గొప్పగా అభివృద్ది చెందాలని కోరుకోవడం ఆయన నైజం. తమ ప్రాంతాభివృద్ధిలో తన పాత్ర వుండాలనుకోవడం ఇష్టం. నాయకుడిగా ప్రజలు మరింత సేవ చేయాలన్నది ఆయనకు ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్ అంటే ఎంతో ప్రాణం. ఆయన పాలనంటే ఎంతో ఎంతో ఇష్టం. ఉద్యమకారుడిగా తెలంగాణ సాధకుడిగా యుగపురుషుడిగా ఆయనను కొలవడం ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్ సంక్షేమ పాలన అంటే మరీ ఇష్టం. మంచినీటికి కూడా గోస పడ్డ మునుగోడుకు అందరికంటే ముందే మంచినీళ్లు ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి కేసిఆర్ అంటే ఎనలేని ఇష్టం. అలాంటి ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనతో, తాను కూడా ప్రజలకు సేవ చేయాలని రవికి ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీస్సులతో తమ ప్రాంత అభివృద్ది తన చేతుల మీదుగా మరింత జరగాలన్నది రవి కోరుకుంటున్న ఇష్టం. మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లో మరింత రాణించాలన్నది ఎంతో ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డిల ఆశీస్సులతో జరుగుతున్న అభివృద్ది మరింత జరగాలని, మునుగోడు అన్ని రంగాల్లో ముందుండాలని ఇష్టం. సామాజిక బాద్యతలో ప్రజాసేవలో వున్న రవి ప్రత్యక్ష్య రాజకీయాల్లో ప్రజా రాజకీయాల్లో ప్రజా భాగస్వామ్య రాజకీయాల్లో కీలకం కావాలని ఆయన అభిమానలకు ఇష్టం. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఇదే మాట…ఎవరు చెప్పినా ఇదే మాట…ఎవరిని కదిలించినా చెబుతున్నది ఒకే మాట..మాకు ఈసారి రవి ఎమ్మెల్యే కావాలని, ఆయన నేతృత్వంలో మునుగోడు మరింత పరుగులు పెట్టాలని…
వ్యాపార రంగంలో ఎంత బిజీగా వున్నా ప్రజలకు చేరువగా వుండడం రవికి ఎంతో ఇష్టం.
ఎందుకంటే తమ ప్రాంతం మీద ఎంతో మక్కువ వున్న నాయకుడు రవి. మునుగోడులో బిసి సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ. అయినా ఇప్పటి వరకు రెడ్డి రాజకీయం తప్ప, బిసిల రాజకీయం సాగలేదు. కాలం మారింది. తెలంగాణ వచ్చింది. బిసి రాజకీయానికి మరింత వన్నె వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలను ఆదుకుంటున్నారు. అన్ని వర్గాలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. సకల జనులతో తెలంగాణ ఉద్యమం సాధించినట్లుగానే, పార్టీలోనూ,పరిపాలనలోనూ అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రోత్సహిస్తున్నారు. అయితే మునుగోడును ఎన్నికైన నాయకులెవరూ గతంలో నియోజకవర్గాన్ని ఏనాడు ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసిఆర్ మునుగోడు కష్టం ప్రత్యక్షంగా చూసి, చలించిపోయారో..అప్పటి నుంచే మునుగోడులో కొంత మార్పు వచ్చింది. మునుగోడుకు కనీసం మంచినీళ్లు ఇచ్చేందుకు కూడా చేతులు రాని ఉమ్మడి పాలకులను కేసిఆర్ ప్రశ్నించారు. నిలదీశారు. కాని ఫలితం కనిపించలేదు. అందుకే తెలంగాణ రాగానే ముందు మునుగోడు గోడు తీర్చారు. అంత గొప్ప నాయకుడి పాలనతో మునుగోడు అభివృద్ది జరగాలంటే ఆ ప్రాంతం మీద ఎంతో అంకితబావం వున్న రవి లాంటి నాయకుడికి అవకాశం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మునుగోడులో ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల కాకుండా రవి లాంటి నాయకుడు ఎమ్మెల్యేగా వుంటే మునుగోడు ఒక వజ్రపు తునకగా మార్చేవారని ప్రజలు అంటున్నారు.
నారబోయిన రవి అటు వ్యాపార రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఎక కాలంలో రెంటింటిలోనూ తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు.
గతంలో కాంగ్రెస్‌లో రాష్ట్ర స్ధాయి నాయకుడిగా వున్నారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోద్భలంతో బిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి మాటంటే రవికి ఎంతో గౌరవం. అందుకే ఆయన పార్టీ కోసం ఏ పని చెప్పినా దానిని విజయవంతం చేయడంలో రవి దిట్ట. పార్టీ పరమైన కార్యక్రమాలెన్నో విజయవంతం చేసి, మంత్రి జగదీశ్‌రెడ్డి చేత అనేక సార్లు శబాష్ అనిపించుకున్నారు. గత ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల గెలుపుకోసం రవి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అయితే గత ఉప ఎన్నికల సమయంలోనే రవికి టిక్కెట్ ఇవ్వాలని పార్టీ శ్రేణులను నుంచి ఒత్తిడి వచ్చింది. రవికి ఇస్తే బిఆర్‌ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే అని పార్టీ శ్రేణులు చెప్పాయి. అంతే కాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా కూడా రవికి అదనపు బలంగా మారింది. కాకపోతే అప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం కూసుకుంట్లకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది. అయినా పార్టీ కోసం తన సర్వ శక్తులు ఒడ్డి కూసుకుంట్లను గెలిపించడంలో కీలకభూమిక పోషించిన నాయకుడు రవి. అందువల్ల ప్రజలు కూడ ఈసారి రవికే టిక్కెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. పార్టీ శ్రేణులైతే ఇప్పటినుంచే రవి టిక్కెట్ దక్కాలని పార్టీ పెద్దల వద్ద తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఎందుకంటే మునుగోడు ప్రాంత అభివృద్ది లక్ష్యం వున్న ఏకైక నాయకుడు నారబోయిన రవి. మరో వైపు ఆయన చేపట్టే సామాజిక కార్యాక్రమాలు మునుగోడు నియోజకవర్గంలో చాలా మందికి అందాయి. నియోజకవర్గంలోనే బలమైన బిసి సామాజిక వర్గంగా ముదిరాజ్‌లున్నారు. సుమారు 45వేలకు పైగా ముదిరాజ్ ఓట్లున్నాయి. మొత్తంగా మునుగోడులో బిసి సామాజిక వర్గాలే ఎక్కు.వ. అందులో ముదిరాజ్‌లదే పెద్ద బలగం. అందుకే నారబోయిన రవికి టిక్కెట్ ఇస్తే బిఆర్‌ఎస్‌కు తిరుగులేని మెజార్టీ రావడం ఖాయం అంటున్నారు. ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడుగా రవికి వున్న పేరు ఎంతో కలిసి వస్తుంది.
ఇదిలా వుంటే మునుగోడులో గత మూడు నెలలుగా డిప్యాక్, నేటిధాత్రిలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేలలో ప్రజలు ఎక్కువగా నారబోయిన రవి గురించే ప్రస్తావిస్తున్నారు.
ఆయన సామాజిక సేవలు గుర్తు చేసుకుంటున్నారు. గ్రౌండ్ రిపోర్టులో నారబోయిన రవికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కనిపిస్తోంది. నియోజకవర్గంలో రవికి అరవై ఎనమిది శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతుండడం గమనార్హం. కూసుకుంట్ల విషయం కనీసం పట్టుమని పది శాతం మంది ప్రజలు కూడా మద్దతివ్వడం కనిపించలేదు. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ బలమైనపార్టీ. తర్వాత స్ధానంలో కాంగ్రెస్ వుంది. బిజేపికి కనీసం క్షేత్ర స్ధాయిలో కార్యకర్తలు కూడా లేరు. గత ఉప ఎన్నికల్లో కేవలం రాజగోపాల్‌రెడ్డి వల్లనే బిజేపికి ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. కాని ఈసారి రాజగోపాల్‌రెడ్డికి కనీసం ఇరవైశాతం ఓట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నిలకడ లేని రాజకీయాలు చేస్తూ, రాజగోపాల్‌రెడ్డి స్వార్ధ రాజకీయాల కోసం పనిచేస్తున్నాడన్న మాట ఎక్కువగా వినిపించింది. అందువల్ల బలంగా వున్న బిఆర్‌ఎస్‌కు మునుగోడు కంచుకోట కావాలంటే నారబోయిన రవికే టిక్కెట్ ఇవ్వాలని ప్రజలు పెద్దఎత్తున అభిప్రాయం వ్యక్తంచేయడం విశేషం.