కార్మికుల వ్యతిరేక పార్టీ బిజెపి.
టీ.ఎ .జి .ఎస్. పొలం రాజేందర్.
మహా ముత్తారం నేటి ధాత్రి.
దేశ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ ఏ యొక్క వాగ్దానాన్ని అమలు జరపకుండా కార్మిక కర్షక యువజన,విద్యార్థి, మహిళ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ దేశ ప్రజలని తీవ్ర ఇబ్బందుల గురి చేసిందని, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జయశంకర్ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు.
మహా ముత్తారం మండల కేంద్రంలోని పోలంపల్లిలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఎం మండల కమిటీ సమావేశం కామ్రేడ్ మానేటి బాపు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బంద్ సాయిలు హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి సర్కార్ అధికారంలోకి వస్తే పెద్ద పెద్ద కుబేరులు దోచుకొని, విదేశాలలో దాచుకున్న నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి భారతీయుని అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని, అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ దానికి విరుద్ధంగా ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా రైతులకు ఉరితాల్లా లాంటి మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను, మోటార్లకు మీటర్లు బిగించే విద్యుత్ సవరణ బిల్లును తీసుకువచ్చారని అదేవిధంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉన్న ఉద్యోగాలని ఉడగొట్టారని, కార్మికులు కొట్లాడి సాధించుకున్న అనేక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చారని, పెద్ద నోట్లు రద్దు చేస్తామని దేశ ప్రజలను మోడీ సర్కారు హరిగోశ పెట్టిందని, యూపీఏ గవర్నమెంట్ లో వామపక్షాల మద్దతుతో తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టానికి తోట్లుపడుతూ ఏ డేటా బడ్జెట్ కోత విధించిందని, అదేవిధంగా అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని ప్రభుత్వ రంగాలను బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేటీకరించిందని వారు విమర్శించారు దేశ పౌరుల సర్వతోముఖ అభివృద్ధికి ఉపయోగపడే శాస్త్రీయ విద్యను నిర్వీర్యం చేసి అశాస్త్రీయమైన, మూఢత్వాన్ని పెంచి పోషించే జాతీయ నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని అంతేకాకుండా దేశంలో కులాల, మతాల మధ్య భావోద్వేగ విషయాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించి దేశ సంపదను కార్పొరేట్లకు తాకట్టు పెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రజల మధ్య అశాంతిని నెలకొల్పుతూ కార్మిక, కర్షక, యువజన, విద్యార్థి, మహిళ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి బిజెపి పార్టీని రాబోయే ఎలక్షన్లలో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోలం రాజేందర్ పార్టీ మహా ముత్తారం మండల కన్వీనర్ పొలం చిన్న రాజేందర్,పార్టీ మండల నాయకులు మడకం బుద్ధ రామ్,రాదరపు. మల్లయ్య,మడకం.భద్రయ్య తదితరులుఉన్నారు.