Labourer Attacks Elderly Man for ₹2,000 in Narsampet
రూ.2 వేల కోసం గొంతునలిపి దాడి
ఆశ్రయం ఇచ్చిన వృద్ధుడిపై ఆంధ్ర కూలీ హత్యాయత్నం
ఆసుపత్రికి తరలింపు..పోలీస్ స్టేషన్ లో పిర్యాదు
నర్సంపేట,నేటిధాత్రి:
రెండు వేల రూపాయలకు కకృత్తి పడ్డ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆశ్రయం ఇచ్చిన వృద్దున్నె హత్యాయత్నం చేశాడు ఈ అమానుషమైన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకోగా సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు,గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన కొల్లాపురం సమ్మయ్య భార్య లక్ష్మి ముగ్గురు కుమారులు,కుమార్తె ఉన్నారు.కుమారులు వారి వారి వృత్తి రీత్యా పలు ప్రాంతాల్లో ఉంటున్నారు.కాగా ఇటీవల భార్య లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది.సమ్మయ్య వృద్దుడు కావడంతో గత కొన్ని నెలలుగా పాటు కుమారుల వద్ద ఉన్నాడు.ఐతే గ్రామంలో ఉన్న తన సొంత ఇంట్లో ఉంటున్న క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి సూతారి పని కోసం గ్రామానికి వచ్చి నివాసం ఉండడానికి వృద్దుడు సమ్మయ్యను ప్రాదేహాపడడంతో నాగరాజు అనే వ్యక్తికి తన ఇంట్లో ఉండడానికి ఆశ్రయం కల్పించారు.మద్యానికి బానిసైన నాగరాజు ఆదివారం వృద్దుడు సమ్మయ్యకు పెన్షన్ రూ.1000 రావడం పట్ల కన్నేసిన ఆంధ్రకూలీ అదే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వృద్ధుని ఇంట్లోని కరెంట్ బల్బులను అర్పేసాడు.తన దగ్గర ఉన్న డబ్బులను ఇవ్వమని గుంతు నలిపి తీవ్రంగా గాయపరిచారు.వృద్దుడు చావు కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొన్ని సంఘటన స్థలానికి చేరుకొనే లోపే అక్కడి నుండి పరారయ్యాడు.

హత్యయత్నం చేసిన ఆంధ్రా కూలిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి..
కూలీ పనుల వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తిపై కఠినమాపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..

విచక్షణ రహితంగా వృద్దునిపై దాడి చేసి హత్యాయత్నం చేసిన నాగరాజు అనే కూలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుమారులు, కోల్లాపురం కోటిలింగం,చంద్రమౌళి,రాజు కోరారు.
