గంజాయి పట్టివేత ముగ్గురు యువకుల అరెస్ట్

ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి

మండలంలోని పోలీసులకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు మెట్టుపల్లి సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ మరియు సిబ్బందితో బండలింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద వాహనములను తనిఖీ చేస్తుండగా నంబర్ ప్లేట్ లేని పల్సర్ బండి పై ముగ్గురు వ్యక్తులు ఆపి తనిఖీ చేయవ వారి బండిలో ఒక నల్లని కవర్లో గంజాయి దొరకడంతో వారిని విచారించగా వారు, లోకిని వంశీ,మరియు, కోయల్ కార్ రమేష్, మరియు, లోకిని విగ్నేష్, మెట్పల్లి నివాసులు అని తెలిపిపారు సోమవారం సాయంత్రం మోటార్ సైకిల్ పై మెట్పల్లి నుండి నిజామాబాద్ వెళ్లి రైల్వే స్టేషన్ స్టాండలో వాహనమును పెట్టి నాందేడ్ కు వెళ్లి గతంలో పరిచయం ఉన్న అజార్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి అతని వద్ద కొంత గంజాయిని కొనుక్కొని మెట్పల్లికి తీసుకువచ్చారు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక ప్యాకెట్ కు 500 రూపాయల చొప్పున అమ్ముదామని ఆ ముగ్గురు వ్యక్తులు వాహనంపై వెళ్లారు పోలీసులు వారిని ఆపి సోదా చేయగా గంజాయి దొరికినాదని పంచుల సమక్షంలో చూపించగా అట్టి గంజాయిని స్వాధీనపరచుకొని నిందితులను అదుపులోనికి తీసుకొని పంచుల సమక్షంలో అట్టి గంజాయిని తూకం వేసి చూడగా సుమారు 220 గ్రాములు వున్నది మరియు వారి వద్దనున్న మూడు సెల్ ఫోన్ లను వారు వాడిన వాహనమును స్వాధీనపరచుకొని ఈ- సాక్ష ద్వారా రికార్డు చేసి నిందితులను అదుపులోనికి తీసుకొని పోలీస్ నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్టులో హాజరు పరచబడును మరియు ఇకనుండి ఈ ప్రాంతంలో ఎవరైనా వ్యక్తులు ఎంతటి వారైనా గంజాయిని కానీ మరియు ఏ ఇతర మత్తు పదార్థాలు గానీ అమ్మిన గాని సేవించిన గాని కఠినంగా శిక్షింపబడుతామని తెలుపుచున్నాము ఎస్ఐ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!