శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో గుడుంబా నిర్మూలనకై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పరకాల ఎక్సయిస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు మండలం నీరుకుల్ల, పెంచికల్ పేట, కటాక్షపూర్, శాయంపేట మండలం నేరేడుపల్లిలలో దాడులు నిర్వహించి గుడుంబా అమ్ముతున్న నీరుకుల్లకు చెందిన ఓదెల పద్మ,వంగేటి రాజలింగం నేరేడుపల్లికి చెందిన కడెం రాజయ్య ప్రాజెక్టులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి (16) లీటర్ల గుడుంబా,180 ml పరిమాణం (15) మద్యం బాటిళ్ళు, (12) బీర్ల ను కూడా స్వాదీనం చేసుకోవడం జరిగింది.ఎక్సయిస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అనిల్ ఆదేశాల మేరకు డీసీ అంజన రావు , ఈఎస్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గుడుంబా నిర్ములనకై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఎవరైనా గుడుంబా తయారు చేసినా అమ్మినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ తాతాజీ, ఎస్సై,జ్యోతి, సిబ్బంది రవీందర్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.