
గొల్లపల్లి నేటి ధాత్రి:
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టమైన ఈ రోజుల్లో ఒక వైపుగొల్లపల్లి మండలం రంగదాముని పల్లి గ్రామ పంచాయితీకార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి గా విధులను నిర్వహిస్తు మరోవైపు గురుకుల పరీక్షలు రాసి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ఎందరో యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు.. ఇటీవల విడుదల అయినా గురుకుల ఫలితాలలో టిజిటి,పిజిటి తో పాటుజేఎల్ (పౌరశాస్త్రం)లోకూడా ఎంపిక అవ్వడం జరిగింది..
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన షరీఫ్ ని గొల్లపల్లి ఎంపీడీఓ రాంరెడ్డి , ఎంపీవో సురేష్ రెడ్డి , గొల్లపల్లి మండల పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామస్థులు అభినందించడం జరిగింది.