
"Triple Loans for One Family"
ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు
★చూసి చూడనట్లు ఉంటున్న అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్:తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి సంస్థ స్కీములకు ఒకే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే ఆర్థిక సహాయం అందుతుంది, అయితే జహీరాబాద్ నియోజకవర్గం లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కార్పొరేషన్ లోన్లు అధికారులు మంజూరు చేశారు. ఈ పథకాలు సాధారణంగా ఒక కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం.ఒకేసారి ఆర్థిక సహాయం అందిన తర్వాత మళ్లీ తిరిగి ఐదు సంవత్సరాల వరకు ఆ కుటుంబానికి వర్తించదు కానీ అధికారులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు లోను మంజూరు చేయడంపై సార్వత్రిక ఉత్కంఠ నెలకొంది దీనిపై అధికారులు పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.ఒకే కుటుంబానికి చెందినవారు మూడు వేర్వేరు కార్పొరేషన్ల నుండి రుణాలు పొందడం అనేది సాధారణంగా నిబంధనలకు విరుద్ధం, దీనికి సంబంధించిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను తెలుసుకోవడానికి మీరు సంబంధిత కార్పొరేషన్ కార్యాలయాలను సంప్రదించడం ఉత్తమం, ఎందుకంటే ఈ నియమాలు ఎప్పటికప్పుడు మారవచ్చు.