తెలంగాణ బిసి సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా తోట రాణి పటేల్ నియామకం.

రాష్ట్ర అధ్యక్షులు. ప్రతాపగిరి విజయ్ కుమార్.

కాశిబుగ్గ నేటిధాత్రి.

తెలంగాణ బిసి బహుజన
సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కారదర్శి గా వరంగల్,కాశిబుగ్గ కు చెందిన తోట రాణి పటేల్ మున్నూరు కాపు ను నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ తెలియచేశారు.తమ కుల సంఘంలో మరియు బిసి కుల సంఘాలలో ఉన్న వారిని కులాలకు అతీతంగా చైతన్య పరుస్తూ హక్కుల సాధన కొరకు తన వంతు కృషి చేస్తున్న తోట రాణి పటేల్ ను గుర్తిస్తూ ఈ పదవిలో అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా తోట రాణి పటేల్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాష్ట్ర పదవి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ కు,తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆకారపు మోహన్ కు, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోనగాని యాదగిరి గౌడ్ కు,తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లపు సమ్మయ్య కు,తెలంగాణ రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నూతనకంటి ఆనందం కు, తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు బిక్షపతి కు,తెలంగాణ అరెకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంబీకార్ అశోక్,, తెలంగాణ మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోర్రీగల శ్రీనివాస్, తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాసమళ్ళ బాలకృష్ణ,తెలంగాణ సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిపిరిశెట్టి శ్రీనివాస్,తెలంగాణ గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిడ్డి కనకయ్య, తెలంగాణ పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మంపాటి వెంకటేశ్వర్లు,దాసరి సంఘం అధ్యక్షులు కాజిపేట వెంకటరామ్ నర్సయ్య, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల కేదారి యాదవ్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బయ్యస్వామి,లీగల్ అడ్వైజర్ ప్రతాపగిరి బిక్షపతి,గంగపుత్ర సంఘం నాయకులు బర్కం రాంమోహన్, కటకం విజయకుమార్,చింత నాగరాజు,ఏనుగుతల యాదగిరి, ప్రతాపగిరి గోవర్ధన్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!