Demand for Strict Action in Dalit Woman Assault CaseDemand for Strict Action in Dalit Woman Assault Case
దళిత మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ
దళిత మహిళ ఉద్యోగి అయిన పరికి జ్యోత్స్న గ్రామం మాదన్నపేట మండలం నర్సంపేట మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ పనిచేస్తున్న వారిపై విధులకు ఆటంకం కలిగిస్తూ ఉంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ అని అడిగినందుకు 02/01/ 2026 రోజున ఆఫీసులో తన రూమ్ లోకి వెళ్లి దాడి చేసిన తోటి ఉద్యోగి అయిన డేటా ఆపరేటర్, గుడారపు చైతన్య శర్మ పై చట్టపరమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటివరకు వారిపై చర్య తీసుకోపోవడం దళిత మహిళకు అన్యాయం చేయడమే ఇప్పటికైనా వారిపై చర్య తీసుకోపోతే దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గ్రామ కమిటీ అధ్యక్షులు రెండో వార్డ్ మెంబర్స్ తిక్క సంపత్ మండల నాయకులు చిలువేరు సుధాకర్ దూడపాక పున్నం వి రాజేంద్రప్రసాద్ పి నరేష్ ఎన్నిండ్ల శ్రీకాంత్ పాల్గొన్నారు
