వనపర్తి నెటిదాత్రి :
అచ్చంపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణను గోరంగా దాడి చేసి ఈడ్చుకు వెళ్లి అవమానపరిచారని దాడి చేసిన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కల్వరాజయ్య ప్రధాన కార్యదర్శి దాచ లక్ష్మీనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుతోట దేవరాజ్ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి గుప్తా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మహిళా చైర్మన్ అని కూడా చూడకుండా గోరంగా అవమానపరిచారని ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతింటాయని వెంటనే దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని పేర్కొన్నారు భవిష్యత్తులో ఆర్యవైశ్యులపై దాడులు చేయ కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు
మార్కెట్ కమిటీ మహిళా చైర్మన్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
