Man Sits on Crocodile, Shocking Viral Video
మొసలితో మజాక్ చేయడమంటే ఇదే.. ఈ అంకుల్ నిర్వాకం చూస్తే అవాక్కవుతారు..
రోడ్డు పక్కన గడ్డిలో ఓ పెద్ద మొసలి పడుకుని ఉంది. అయితే అది చనిపోయిందా.. లేక మొసలి బొమ్మనా అనేది స్పష్టంగా తెలియలేదు. మొసలి మాత్రం చలనం లేకుండా పడి ఉంది. ఇంతలో..
ఎక్కడ ఏ చిన్న విచిత్ర, వింత, వినోద సంఘటన జరిగినా.. వీడియో రూపంలో ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని వీడియోలు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి షాకిచ్చే వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మొసలిపై కూర్చొన్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. చావుకు షార్ట్ కట్ చూసుకుంటున్నాడేమో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మొసలి కడుపుపై చేతులతో కొడుతూ చాలా సేపే దానిపై (man sitting on crocodile) కూర్చొనే ఉన్నాడు. తర్వాత మొసలిపై పడుకుని ఫొటోకు ఫోజులు ఇచ్చాడు. ఇలా చాలా సేపటి తర్వాత.. దానిపై నుంచి పైకి లేచి తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అతను అంత చేస్తున్నా కూడా మొసలి కదలకపోవడంతో అంతా అది చనిపోయిందని భావిస్తున్నారు. లేదా మొసలి లాంటి బొమ్మ అయి ఉండొచ్చని అనుకుంటున్నారు.
ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘బహుశా దాని ఓనర్ అయి ఉంటాడు..అందుకే ఆ మొసలి ఏమీ చేయలేదు’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా లైక్‌లు, 1.19 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
