
Ayudha Puja Ritual This Dasara
ఆయుధ పూజ మంత్రం ఇదే!
జహీరాబాద్ నేటి ధాత్రి;
దసరా పండుగకు ముందు వచ్చే ఆయుధ పూజను ఈ ఏడాది అక్టోబర్ 1న నిర్వహించుకుంటున్నారు. నవరాత్రులలో మహర్నవమి రోజున జరిగే ఈ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రైతులు, వాహనదారులు, టైలర్లు, కార్మికులు తమ పనిముట్లను, వాహనాలను దుర్గామాత ముందుంచి పూజిస్తారు. పురాణాల ప్రకారం, పాండవులు యుద్ధానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై భద్రపరిచి పూజించినట్లు తెలుస్తోంది. ఈ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః’ అనే మంత్రాన్ని పఠించడం శుభప్రదమని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అని, కేరళలో పోటీలు, తమిళనాడులో సరస్వతీ దేవి పూజ (గోలు) చేస్తారు.