BRS MLA Slams CM Revanth Reddy
ఇదెక్కడి సభ.. ఇదెక్కడి సంప్రదాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం భజన చేసేందుకు తాము అసెంబ్లీకి రావాలా అని ప్రశ్నించారు.
హైదరాబాద్, జనవరి 3: అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని దేశమంతా చూసిందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాలలో సీఎం గంటన్నర సేపు మాట్లాడటం శాసన సభ చరిత్రలో లేదన్నారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లా వాడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి ఇష్టా రాజ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ చావు కోరుకోవటం… హరీష్ రావును బాడీ షేమింగ్ చేయటం తప్ప సమాధానం చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి నోట్లో మూసి కంపు పెట్టుకొని హరీష్ రావు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఫైర్ అయ్యారు.
