
చిరుప్రాయంలోనే ఉరికంబాన్ని ముద్దడినవారు దేశ భక్తులు…!
సంకే రవి CPM జిల్లా కార్యదర్శి
చెన్నూర్,నేటి ధాత్రి::
ఈరోజు సోమగుడెం(కే) ట్యాంక్ బస్తీలోని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి నివాసంలో భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సంకే రవి మాట్లాడుతూ దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని,మతం పేరుతో జరుగుతున్న మతోన్మాద చర్యలను వ్యతిరేకించి ఉరికంభాన్ని ముద్దాడిన భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్ఫూర్తి నేటికీ ఆదర్శప్రాయమే అన్నారు. కానీ నేడు దేశాన్ని పాలిస్తున్న RSS నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.బ్రిటిష్ వారి క్షమాభిక్షతో వారికి సేవ చెయ్యడం కోసం జైల్ నుండి విడుదలైన సావర్కర్ ను నేడు వీర సావర్కర్ గా దేశ ప్రజలకు చూపించడం జరుగుతుంది.చరిత్రను నేటి ప్రజలకు తప్పుగా చుపించడం జరుగుతుంది.
బ్రిటిష్ వారి ఊడిగం చేసిన సావర్కర్ దేశ భక్తుడేల అవుతాడో ప్రజలు ఆలోచించాలి అన్నారు.
నేడు దేశంలో ఉన్న పేదరికాన్ని,అవినీతిని,
నిరుద్యోగాన్ని నిర్మూలించకుండ.
10 సం.రాలుగా అధికారంలో ఉండి దేశ భక్తులుగ పోజులు కొట్టుతున్నరు అన్నారు.ఈ కార్యక్రమంలో
మాజీ ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,
మాజీ వార్డ్ సభ్యులు సపాట మల్లేష్,మాజీ కో అప్షన్ సంకే రాజ కుమారి,
యూత్ నాయకులు ఎనగందుల వినోద్,భుక్య సాయి పున్నం,సంకే శ్రీనిత,సంకే లక్ష్మీ,సంకే లింగయ్య,మహేష్ తదితరులు పాల్గొన్నారు.