భూ కబ్జాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య మండల డిప్యూటీ తాసిల్దార్ ప్రభావతికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వంగర సాంబయ్య మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించుటకు ఈనెల ఒకటి నుండి తొమ్మిది వరకు దరఖాస్తుల ప్రక్రియను కొన్నింటికి పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ధరణి బాధితులు ఉన్నారని
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధరణిని రద్దు చేస్తాము బాధితులు అందరికీ న్యాయం చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నామన్నారు
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో జరిగిన భూ కబ్జాలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వారికి బంధ హస్తాల్లో ఉన్న భూమిని బాధితులందరికీ ఇప్పించే ఏర్పాట్లు చేయాలని
అట్లాగే భూ కబ్జాలపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయుటకు పూనుకోవాలని
తద్వారా బాధితులందరికీ వారి భూములు వారికి చెందే అటు చర్యలు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ధరణి స్పెషల్ డ్రైవ్ పేరుతో 9వ తారీకుతో ముగింపు కాకుండా
నిరంతరం భూ బాధితులకు మరియు ధరణిలో జరిగిన నష్టాన్ని మరల ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం కొరకు తగు చర్యలు తీసుకోవాలని కోరడమైనది ఈ కార్యక్రమంలోతెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనంకొండ జిల్లా కార్యదర్శి మరియు జిల్లా నాయకులు జేమ్స్ మండల నాయకులు ఆడేపు అశోక్
తదితరులు పాల్గొన్నారు.