
గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని పుట్టాలభూపతి గ్రామం సుమారు 400 వందల కుటుంబం లు నివాసిస్తుంటారు గంగారం టు కొత్తగూడ ప్రధాన రహదారి కి సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది ఆ గ్రామం గత ప్రభుత్వం లో ఈ గ్రామనికి రోడ్డు మంజురు చేశారు గుత్తెదరు కూడా హడావిడి గా కంకర మాత్రం పోశారు రోడ్డు వేయడం మర్చిపోయారు తర్వాత ఎన్నికల కోడ్ అన్నారు రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు దాటిన ఈ రోడ్ సైడ్ చుసిన నాయకులు లేరు అధికారులు లేరు మా దారి కి కంకర పోయాక ముందు మట్టి రోడ్డు తోనైనా మంచిగా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కంకర రోడ్డు పైన ఆటోలు రావడం లేదు అంబులెన్సు రావడం కూడ కష్టం గా ఉందని మా ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి అయ్యారు కనుక సీతక్క ప్రత్యేక ద్రుష్టి సారించి త్వరగా రోడ్డు పూర్తి చేసే విదంగా చూడాలి అని గ్రామస్తులు సీతక్క ను వేడుకుంటున్నారు…