
Government Land
బోర్డు పెట్టి, కంచె మరిచారు
చేవెళ్ల, నేటిధాత్రి:
కోటి విలువైన ప్రభుత్వ స్థలానికి బోర్డు పెట్టి, కంచే వేయడం మరిచారు.
శంకర్పల్లి మున్సిపల్ పట్టణ కేంద్రంలో సర్వే నెంబర్ 220 లో సుమారు 300 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదుతో వారం రోజుల క్రితం శంకర్పల్లి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ఆ స్థలంలో ప్రభుత్వ స్థలం సూచిక బోర్డుపెట్టారు. కాని యధావిధిగా ఆ కాలానివాసులు పదుల సంఖ్యలో కార్లు పార్క్ చేసి ప్రయివేట్ గా ఉపయోగిస్తున్నారని, ఆక్రమణకూ గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోటి విలువైన ఈ భూమి లో సూచికబోర్డు పెట్టారు. అదేవిదంగా సర్వేనెంబర్ 220లో పక్కనే ఉన్న నాలా స్థలంలో కొన్ని నెలల క్రింద ఇరిగేషన్ అధికారులు నాలా స్థలానికి మార్క్ చేశారు. కాని కొంతమంది మార్క్ దాటి ముందుకు జరిగి నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ కొంత ప్రభుత్వ స్థలం
ఆక్రమణకు గురైందని స్థానికులు అరుపిస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ విలువైన భూమికి కంచె వేసి ప్రభుత్వ స్థలానికి రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.