
Drains
కొత్త కాలువ నిర్మించారు,పాత బండరాళ్లను తీయ్యడం మరిచారు…
మందమర్రి నేటి ధాత్రి
ఒకవైపు వర్షాలు, మరో వైపు నిండిన కాలువలు, పట్టించుకునే వారేరని ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు.
జరా పట్టించుకోండి సార్, దోమల బెడదతో అల్లాడుతున్నా కాలనీ వాసుల గోడు.
అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సిపియం పార్టీగా విజ్ఞప్తి.
దూలం శ్రీనివాస్
సిపిఎం మందమర్రి మండల కార్యదర్శి.
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఏరియా 3వ వార్డులో ఇటీవల కొత్త కాలువ నిర్మాణం చేసిన అధికారులు, పాత కాలువకు సంబంధించిన కాంక్రీట్ మరియు రాళ్లను రోడ్డు మీదనే వదిలి మరచిపోయారు. దానితో కాలనీ వాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకట్లో బండలు తగిలి గాయలపాలవుతున్నారు. వెహికల్ పై వచ్చే వారు కొంచెం అజాగ్రత్తగా వచ్చిన పెద్దపెద్ద బండరాళ్లకు తగిలి కింద పడుతున్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకొంటూ ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు కాలువలు శుభ్రం లేక, చుట్టూ పిచ్చి మొక్కలతో నిండి భయంకరంగా మారి పాములు ఇతర పురుగుబూసి కనిపించే పరిస్థితి కూడా లేదు. అంతేకాకుండా దీని వలన దోమల బెడద విపరీతంగా పెరిగాయి. కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోని అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిపియం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాము.