Why Hair Fall Increases in Winter
శీతాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కారణాలు ఇవే.!
చలికాలంలో జుట్టు పొడిబారిపోయి ఎక్కువగా రాలిపోతుంది . దాదాపు అందరూ ఈ సమస్యను ఎదుర్కుంటారు. ఈ సీజన్లో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి ఇంకా కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలంలో జుట్టు పొడిబారడాన్ని తగ్గించడానికి చాలా మంది జుట్టుకు అధికంగా నూనె రాసుకుంటారు. కానీ అధికంగా నూనె రాయడం వల్ల చుండ్రు పెరుగుతుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. అందువల్ల, తలస్నానం చేయడానికి కనీసం ఒక గంట ముందు జుట్టుకు నూనె రాయడం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
వెచ్చని దుస్తులు
శీతాకాలంలో మనం తరచుగా వెచ్చని టోపీలు ధరిస్తాము. జుట్టు పొడిగా, చిట్లినట్లు, విరిగిపోయే అవకాశం ఉండటానికి ఇది కూడా ఒక కారణం. కాబట్టి, మృదువైన టోపీని ధరించండి.
విటమిన్ డి లోపం
శీతాకాలంలో జుట్టు రాలడానికి అత్యంత సాధారణ కారణం విటమిన్ డి లోపం. ఎందుకంటే సూర్యరశ్మి తగ్గుతుంది. కాబట్టి, మీ ఆహారంలో విటమిన్ డి పోషకాలు ఉన్నవాటిని తీసుకోండి. శీతాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతే, విటమిన్ డి పరీక్ష చేయించుకోండి.
