‘‘కూడిక’’,’’తీసివేత’’లు లేవు!

`విస్తరణ మరో ఆరు నెలల దాక అవకాశం లేదు.

`విస్తరణ పై ఎలాంటి కదలికలైనా ‘‘జూన్‌’’ తర్వాతే.

`ఉద్వాసన ఆలోచన అసలే లేదు.

`‘‘ఎమ్మెల్సీ’’ ఎన్నికలన్నీ పూర్తయ్యేదాకా ఎలాంటి కదలికలు వుండవు.

`‘‘ఎమ్మెల్సీ’’ లలో ఇద్దరికీ క్యాబినెట్లో చోటు.

`అధిష్టానం కూడా ‘‘సీఎం రేవంత్‌’’ నిర్ణయాలకే పూర్తి మద్దతు.

`ఈ ఏడాదిలో అనేక ఎన్నికలు.

`ప్రత్యర్థి రాజకీయాలకే సమయం కేటాయింపు.

`అన్ని ఎన్నికలలో మెజారిటీ స్థానాలపైనే గురి.

`పార్టీలో లుకలుకలు ఏమీ లేవు.

`లేని తేనె తుట్టెను కదపాలనుకోవడం లేదు.

`రాష్ట్ర పార్టీలో అసమ్మతి తెచ్చుకోవడం సుతారం ఇష్టం లేదు.

`అంతా సవ్యంగా సాగుతోంది.

`సిఎం రేవంత్‌ రెడ్డి బ్రాండ్‌ ముద్ర బలంగా పడుతోంది.

`ఈ ఏడాది అభివృద్ధి, ఎన్నికల మీదనే ప్రధాన దృష్టి.

`ఎలాంటి నిర్ణయాలైనా అప్పటి వరకు ఆగాల్సిందే.

`మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.

`కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలలో కదలికల కోసం ‘‘ఓ సెక్షన్‌ మీడియా’’ పన్నాగం.

`అధిష్టానం ఎలాంటి మార్పులు, కూర్పులకు ఆదేశం ఇవ్వలేదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాష్ట్రంలో మంత్రి వర్గ కూర్పు ఇప్పట్లో లేదు. మంత్రుల ఉద్వాసన అన్న దానికి ఆస్కారమే లేదు. కాని ఈ మధ్య ఈ రకమైన ప్రచారం విసృతంగా జరుగుతోంది. మీడియా వర్గాలు ఊహాగానాలు తప్ప, కాంగ్రెస్‌ పార్టీ నుంచి వస్తున్న లీకులు కూడా కాదు. ఎందుకంటే ఏ లీకులైనా సరే కొంత కాలమే పనిచేస్తాయి. కాని ఎల్ల కాలం పని చేయవు. అవే నిజమైతే ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణ జరగాల్సి వుంది. గత ఆగష్టులోనే మంత్రి వర్గ విస్తరణ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అధిష్టానం సూచనలు కూడా పూర్తయ్యాయన్నారు. కాని ఏం జరిగింది. ఎలాంటి కదలిక లేదు. కారణం అవన్నీ మీడియా సృష్టించిన వార్తలు. అందుకే వాటిలో నిజం లేకుండాపోయింది. గత కొంత కాలంగా కూడా ఇదే రకమైన వార్తలు వండి వారుస్తున్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ మంత్రి వర్గ విస్తరణతోపాటు, కొంత మంది మంత్రులు ఉద్వాసన అంటూ కొత్త కథలు అల్లుతున్నారు. అసలు మంత్రి వర్గం నుంచి ఒక మంత్రిని తప్పించాలంటే ఎలాంటి కారణాలు వుండాలో తెలియనంత అమాయకంగా వార్తలు రాస్తున్నారు. ఉన్న ఫలంగా ఏ మంత్రినైనా తొలగించే అధికారం ముఖ్యమంత్రికి వున్నప్పటికీ అలాంటి సందర్బాలు చాల తక్కువ. పని తీరు బాగా లేదనో , మరో కారణం చేత మంత్రులను మార్చడం అన్నది గతంలో ఎప్పుడూ జరలేదు. కాకపోతే సంబందిత మంత్రి మీద విపరీతమైన ఆరోపణలు ముసురుకున్నప్పుడు తప్ప మంత్రులను తప్పించే పరిస్దితి ఎప్పుడూ వుండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అలాంటి మంత్రులు ఎవరూ లేరు. కాని ఓ సెక్షన్‌ఆఫ్‌ మీడియా పని గట్టుకొని కొంత మంది మంత్రులకు ఉద్వాసన అంటూ లేని లెక్కలు చెబుతున్నారు. లేని కారణాలు చూపిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు మీడియా వార్తలను పట్టుకొని రాజకీయం చేయడు. ఇది ఇప్పుడు కాదు..అనాదిగా వస్తున్నదే! అలా అనుకుంటే ఏ మంత్రి వర్గంలోనూ ఏ ఒక్క మంత్రి పూర్తి కాలం పదివిలో వుండరు. ఇక ఇదిలా వుంటే మంత్రి వర్గ విస్తరణ ఇప్పుడప్పుడే వుండే అవకాశం ఎట్టిపరిస్ధితుల్లో లేదు. ప్రస్తుతం మంత్రి వర్గ కూర్పు ఆలోచన కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మదిలో లేదు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద చేస్తున్న ఒత్తిడి లేదు. మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చేయాలనుకున్నప్పుడు మాత్రమే అధిష్టానం జోక్యం చేసుకుంటుంది. అధిష్టానం సూచనలను అప్పుడు పాటించాల్సి వుంటుంది. అందులోనూ మంత్రుల ఎంపిక బాధ్యత పూర్తిగా ముఖ్యమంత్రి సమ్మతంతోనే జరగుతుంది. అంతేకాని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వున్న వాళ్లను ఎప్పుడూ అధిష్టానం సూచనలు చేయదు. ఒత్తిడి అసలే చేయదు. అదే జరిగితే ఆ మంత్రులు ముఖ్యమంత్రి మాట వినే అవకాశాలు తక్కువగా వుంటాయి. అప్పుడు ప్రభుత్వం అబాసుపాలౌతుంది. మొదటికే మోసం వస్తుంది. గతంలో ఓసారి ఉమ్మడి రాష్ట్రంలో అధిష్టానం సూచనల మేరకు జేసి దివాకర్‌రెడ్డిని మంత్రి వర్గలోకి వైఎస్‌ తీసుకున్నారు. అది వైఎస్‌కు ఇష్టం లేదు. కాకపోతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం పెద్ద క్యాబినేట్‌. అందువల్ల ఒకరో, ఇద్దరో ముఖ్యమంత్రికి వ్యతిరేకత వున్న మంత్రులు వున్నా వారిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అసవరం వుండేది కాదు. రెండోసారి వైఎస్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత జేసి దివాకర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు. అంటే ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్చ ఎంతగా వుంటుందో ఈ ఒక్క సందర్భాన్ని గుర్తుచేసుకోవచ్చు. అందవల్ల అధిష్టానం ఎప్పుడూ ముఖ్యమంత్రిని ఇబ్బందులకు గురి చేసే పరిస్దితి వుండదు. రాదు. గతంలో ఇలాంటి పరిస్దితి కనిపించేదని అంటారే గాని, అది కూడా నిజం కాదు. పైగా సోనియాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రులను మార్చడం, రాష్ట్ర పార్టీలో కల్లోలాలు సృష్టించడం అన్నది ఎప్పుడూ లేదు. అలాంటి రాజకీయాలను సోనియాగాందీ ఆహ్వానించలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికే అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా వున్నాయి. లేకుంటే కొంత మంది సీనియర్‌ నాయకులు తమ గళం ఎప్పుడో విప్పేవారు. ఇక మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుముకంగా లేరు. ఈఏడాది ఎలాగైనా తన మార్కు పాలన చూపించాలన్న పట్టుదలతో వున్నారు. రాజకీయాల్లో ఆయనకు వున్న బ్రాండ్‌ను పాలనలో కూడ చూపించాలన్న తపనలో వున్నారు. అందువల్ల ఆయన లేని పోని తలనొప్పులు పెట్టుకోవాలనుకోవడంలేదు. లేని సమస్యలు రద్దుకోవాలన్న ఆలోచన అసలే లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వుండేంత దూరాలోచన ఎవరికీ వుండదు. ఆయన వచ్చే ఐదేళ్ల కాలంలో ఏం చేయాలో ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటారు. ఆ లెక్కలను సరిచేసుకుంటూనే రాజకీయం చేస్తారు. అంతే గాని ఎదురయ్యే సమస్యలకు బెదిరిపోయే వ్యక్తిత్వం కాదు. ఏదైనా తన దగ్గరకు రావాల్సిందే. తాను చేయాలనుకున్న రాజకీయం చేయాల్సిందే. అదే ఆయన ఎదుగుదలకు దోహదపడిరది. ఆ దారిని ఆయన మార్చుకోరు. అందుకే ఆ మధ్య డిల్లీలో జరిగిన మీడియా సమావేశంలోనే మంత్రి వర్గ కూర్పుపై స్పష్టమైన సంకేతాలు ఎప్పుడో ఇచ్చారు. అందుకే పదే పదే మీడియా ఊహలకు సమాధానం ఎవరూ చెప్పరు. కాని రేవంత్‌ రెడ్డి ఇచ్చిన సమాదానంతో సంతృప్తి చెందని మీడియా తనదైన శైలిలో ఈ విషయాన్ని తెరమీదకు తెస్తూనేవుంది. కాని ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలున్నాయి. త్వరలో మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత జూన్‌లో మరో ఆరు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగాల్సి వుంది. ఇంతలో కూడా స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగాల్సిన అసవరం వుంది. జిహెచ్‌ఎంసి లాంటి ఎన్నికలున్నాయి. అసలే హైదరాబాద్‌లో మంత్రి లేడు. ఇవన్నీ దృష్టిలో వుంచుకొని మంత్రి వర్గ కూర్పు చేయాల్సి వుంది. ఆగమేఘాల మీద మీడియా ఉత్సాహం కోసం మంత్రి వర్గ విస్తరణ జరిగేది కాదు. ఇప్పటి వరకు అసెంబ్లీ నుంచి మాత్రమే మంత్రులను తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీలకు కూడా ఓ ఇద్దరికి అవకాశం ఇవ్వాల్సి వుంది. కాంగ్రెస్‌ పార్టీకి మండలిలో కూడా కొంత మెజార్టీ రావాలంటే జూన్‌ వరకు ఆగాల్సివుంటుంది. అప్పుడు ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా వున్న ఓ నాయకుడికి హమీ వుంది. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆయన ఎమ్మెల్సీ కావాల్సి వుంది. ఆ పై మంత్రి కూడా అయ్యేందుకు అవకాశాలున్నాయి. ఆయనకు ఎప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం అందుతుందో ఆ తర్వాతే మంత్రి వర్గ విస్తరణ వుంటుంది. అప్పటి వరకు ఎలాంటి విస్తరణ వుండే అవకాశాలు లేవు. పైగా త్వరలో బెడ్జెట్‌ సమావేశాలున్నాయి. కనీసం నెల రోజులైనా జరిగే అవసరం వుంది. లేని పక్షంలో రమారమి 20 రోజులైనా బడ్జెట్‌ సమావేశాల నిర్వహన జరుగుతుంది. ఈ సమయంలో మంత్రి వర్గంలో మార్పులు, కూర్పులు పెట్టుకొని అసెంబ్లీలో ప్రతిపక్షాలకు అవకాశం దక్కనిస్తారా? అధికార పక్ష సభ్యులు అసెంబ్లీలో మౌనం దాల్చే పరిసి ్ధతులు ఎవరైనా తెచ్చుకుంటారా? ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు విస్తరణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సన్నిహితులతో చెబుతూనే వున్నారు. కాని ఇలాంటి వార్తలు వస్తూనే వుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాగైనా ఏదో ఒకరమైన లుకలుకలు తేవాలని ప్రతి పక్షాలు చూస్తున్నాయి. వాటిని ఆసరగా చేసుకొని రాజకీయాలు చేయాలని ఆలోచిస్తున్నాయి. వాటి బుట్టలో పడడం వల్ల కాంగ్రెస్‌ పార్టీకే నష్టమౌతుంది. అందువల్ల ఎవరూ స్పందించొద్దని కూడా అధిష్టానం ఇతర నాయకులను హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఎంతో కష్టపడుతుంటే మిగతా మంత్రుల్లో కొందరు సరైన స్పందన చూపడం లేదన్న అభిప్రాయాన్ని అధిష్టానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటి వరకైనా క్యాబినేట్‌ సమిష్టి నిర్ణయాలతో మాత్రమే ముందకు సాగుతున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్చనిచ్చారు. ఏ మంత్రి శాఖలోనూ ముఖ్యమంత్రి ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. ప్రజా ప్రభుత్వం అంటే ఎలా వుంటుందో నిజంగా చూపిస్తున్నారు. అందుకే మంత్రుల్లో ఉద్వాసన ప్రశ్న ఉత్పన్నమేకాదు. కాని విస్తరణ ఇప్పటికైతే లేదనే సమాచారం అందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!