‘‘రీల్‌ హీరో పైత్యానికి’’ ‘‘రియల్‌ హీరో వైద్యం’’.

`ది రియల్‌ హీరో సిఎం రేవంత్‌ రెడ్డి!

`తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెడుతున్న అసలైన తెలంగాణ వాది రేవంత్‌ రెడ్డి.

`తెలంగాణ సంపద దోచుకొని విర్ర వీగుతున్న వారి కోరలు పీకే దమ్మున్న పాలకుడు రేవంత్‌ రెడ్డి.

`సినిమా పేరుతో తెలంగాణ మీద అధిపత్యం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పిన మొగోడు రేవంత్‌ రెడ్డి.

`రాజకీయం కోసమో, ఓట్ల కోసమో తెలంగాణను పణంగా పెట్టని గొప్ప వ్యక్తిత్వం రేవంత్‌ రెడ్డిది.

`తెలంగాణ ఒక చరిత్ర… దాని ముందు సినిమాలు ఒక దరిద్రం.

`తెలంగాణలో ఆంద్రా సినీ ఆధిపత్యానికి అడ్డుకట్ట.

`తెలంగాణ ముసుగులో ఆంద్రాకు కొమ్ము కాసే వారి కొమ్ములు విరిచేదే రేవంత్‌ రెడ్డి.

`అల్లు సొల్లుపై పోలీస్‌ ఆగ్రహం!

`అల్లు నక్క వ్యవహారం.. అబద్దాల పుట్టకు నిదర్శనం.

`అల్లు వ్యవహారంపై సిఎం. రేవంత్‌ రెడ్డి సీరియస్‌.

`మహిళ చనిపోయిందని తెలిసినా సినిమా చూస్తూ కూర్చుంటావా!

`రెండు వారాలు గడుస్తున్నా కుటుంబాన్ని పరామర్శించడా!

`అల్లు మీడియా సమావేశంపై మంత్రి కోమటి రెడ్డి ధ్వజం.

`మహిళ మరణాన్ని కూడా లెక్క చేయని వ్యక్తి హీరో ఎలా అవుతాడు.

`ఇకపై తెలంగాణలో బెన్‌ఫిట్‌ షోలు వుండవు.

`సినిమా రేట్ల పెంపు కుదరదు.

`మంత్రి కోమటి రెడ్డి తన ట్రస్ట్‌ ద్వారా 25 లక్షల సాయం.

`పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో అబ్బాయికి అందుతున్న వైద్యం.

`బాధిత కుటుంబానికి అల్లు పది కోట్లు ఇచ్చినా తక్కువే.

`అల్లు అర్జున్‌ చెప్పినవన్నీ అబద్దాలే!

`మహిళ చనిపోయిన విషయం మరునాడు దాక తెలియదనడం పచ్చి అబద్ధం.

`క్షణాలలో సమాచారం అందుతున్న ఈ రోజుల్లో ఇంతకన్నా అబద్ధం మరొకటి వుండదు.

`పోలీసులు తనకు ఆ విషయమే చెప్పలేదనడం తప్పు మీద తప్పు చేయడమే!

`అల్లు తండ్రి, కొడుకుల విపరీత డ్రామా.

`బాధిత కుటుంబానికి ఇంతవరకు అందని అల్లు సాయం.

`ఇరవై ఐదు లక్షలు ప్రకటించినా అందని వైనం.

`నిర్మాత, దర్శకుడు, హీరో కలిసి ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తామని అరవింద్‌ కొత్త బాష్యం.

`బాధిత కుటుంబానికి సాయం కోసం ట్రస్ట్‌ ఏర్పాటు ప్రకటన బాధ్యతారాహిత్యం.

`తేల్చి చెప్పిన పోలీసు యంత్రాంగం.

`పోలీసు ఉద్యోగుల సంఘం కూడా సీరియస్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పుష్ప అంటే ప్లవర్‌ అనుకుంటివా? పైర్‌ అనింటివి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫైర్‌కు ఎర్రిపుష్పం మాడిపోయేలా చేసుకుంటివి. తగ్గేదే లే అని గొప్పలు పోయి తగ్గి తగ్గి వంగి వంగి సాగిలపడాల్సి వచ్చే. తేనే సీసాలో ఒక్క చుక్క నీరు పడినా చెడిపోతుంది. తా చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు సినీమా ఇండస్ట్రీ పరువు మొత్తం తీస్తివి. ఇండ్రస్ట్రీ అంటే నేనే..ప్యాన్‌ వరల్డ్‌ నాదే అంటివి. ఇప్పుడు సినిమాకే దిక్కు లేకుండా చేసుకుంటివి. అల్లు మూలంగా సినిమా ఇండస్త్రీ మొత్తం తలెత్తుకోకుండా పోయింది. భయంతో బిక్కుబిక్కు మనే కాలమొచ్చింది. అవసరమైతే తట్టా బుట్టా సర్ధుకునే పరిస్ధితి దాపురించింది. స్వయం కృషితో సంపాదించుకున్న స్టార్‌డమ్‌ అదే స్వయంకృతాపధరాధంతో గాలికి కొట్టుకుపోయేలా పోయింది. రాజ్యం ముందు తిక్క వేషాలేస్తే తుక్కు, తుక్కు కావాల్సి వచ్చింది. పూలమ్ముకునే చోట కట్టెలమ్మే దుస్ధితి తెచ్చుకున్నట్లైంది. ఇంత కాలం తెర మీద హీరోలమని విర్రవీగిన అల్లుయే అసలు విలన్‌ తేలిపోయింది. హీరోయిజం జీరోయిజానికి జారుకున్నది. తిరిగి కోలుకోవాలంటే మరో జీవిత కాలం సరిపోనంత దూరం జారిపోయింది. ఐకాన్‌ అల్లు కాస్త సొల్లు ఆటిట్యూడ్‌ చూపించి, కుళ్లి కుళ్లి ఏడ్చేదాక తెచ్చుకున్నట్లైంది. అల్లు ఒక వైపు, సినిమా లోకం ఒకవైపు చీలిపోయినట్లైంది. అల్లు తనకు తానుగా ఏకాకిగా మారాల్సివచ్చింది. అల్లుకు బాసటగా నిలవాలంటే ఎవరికైనా వణికిపోయేంత భయం పట్టుకున్నది. ఇప్పుడు చెప్పండిరా..సినీ అహం నిండిన అబ్బాయిలు వాట్‌ టు డు..వాట్‌ నాట్‌ టు డూ…అని మీన మేషాలు లెక్కించుకుంటూ నలు దిక్కులు పిచ్చి చూపులు చూడాల్సి వచ్చింది. అతి శాంతనం కొంపకు చేటు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. వింటే కదా…సినిమా బలుపు..పుసులు కారిపోతే తప్ప తెలియదు. పుష్ప అని పేరు పెట్టుకొని, ఫైర్‌ అంటే సరిపోతుందా? కూష్మాండం బద్దలౌతుంది. తగ్గేలేదని సినిమాలో అన్నట్లు నిజ జీవితంలో అంటే తుక్కు రేగిపోతుంది. ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి. అంతే కాని అతి చేస్తే పర్యవసానాలు ఇలాగే వుంటాయి. ఫ్లవర్‌ ఎప్పుడూ ఫైర్‌ కాదు. తెరమీద డైలాగులు బాగానే వుంటాయి. బైట చెబితేనే అసలైన సినిమా కనిపిస్తుంది. పువ్వును సున్నితంగా పట్టుకున్నప్పుడే అందం. నిప్పును చేతితో పట్టుకుంటే కాలడం ఖాయం. అది తెలుసుకోకపోవడం అల్లు అర్జున్‌ చేసుకున్న ఖర్మం. సినిమా చూపిస్త మవా అంటూ చిందులేసి, వెర్రి వేషాలేస్తే తెరమీద నడిచినా సమాజంలో సాగదు. అందుకు అల్లుకు దిమ్మ తిరిగి అసలైన బొమ్మ కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్‌ ఆటిట్యూడ్‌ తొలి సినిమా నుంచే తెర మీద చూపిస్తూ వస్తున్నాడు. ఆర్య సినిమాలో సిన్సియర్‌గా హీరోయిన్‌ను ప్రేమిస్తున్న వ్యక్తిని విలన్‌ను చేయాలని చిల్లర మల్లర వేషాలన్నీ వేస్తాడు. ఆఖరుకు నికార్సైన ప్రేమికులను విడదీస్తాడు. ఆర్యా టూలో తనకు జీవితం ఇచ్చిన స్నేహితుడి ప్రేమను తుంచి, స్నేహితుడిని విలన్‌ చేస్తాడు. ఇలాంటి సినిమాలు ఎన్నుకున్నప్పుడే అల్లు అర్జున్‌ వ్యక్తిత్వం కూడా అర్ధమౌతుంది. పాత్ర ఎంపికలో కూడా వారి జీవితం కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అలా అల్లు అర్జున్‌ చేసిన ప్రతి సినిమాల్లో చిల్లర వేషాలు, కన్నింగ్‌ సీన్లే ఎక్కువగా వుంటాయి. సినిమా సాగినట్లు, వ్యవస్ధలోనూ సాగుతుందన్న భ్రమల్లో బతికితే ఇలాగే వుంటుంది. వారికి మానవత్వం విలువ ఎలా తెలుస్తుంది. అందుకే కటకటాలను చూడాల్సి వచ్చింది. చేజేతులా జీవితం తలకిందులు చేసుకోవాల్సి వచ్చింది. ఇది సినిమా వాళ్లకే కాదు, అందరికీ ఒక గుణపాఠమే. ఇక తెలంగాణను దోచుకుంటున్న వారిలో సినీ ప్రముఖులు కూడా వున్నారు. తెలంగాణ వచ్చినా రియల్‌ వ్యాపారం చేసేవాళ్లు ఆంధ్రులే. అందులో సంపాదించిన సొమ్మును పెట్టుబడిగా పెట్టిసినిమాలు తీసేది ఆంద్రా వాళ్లే. అటు సినిమా, ఇటు రియల్‌ రంగంలో దూరి తెలంగాణను ఆగం చేస్తున్నది వాళ్లే. ఇది ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పక్కాగా కనిపెట్టారు. తెలంగాణకు జరుగుతన్న అన్యాయాన్ని పసిగట్టారు. వాళ్ల పైత్యానికి ముకు తాడు వేయాలనుకున్నాడు. తెలంగాణకు నిజమైన రక్షకుడుగా మారుతున్నారు. తనకు ప్రజలు ఇచ్చిన అధికారానికి నూటికి నూరుపాళ్లు న్యాయంచేస్తున్నారు. తెలంగాణ సంపద దోచుకుంటూ విర్రవీగేవారికే అంతుంటే, తెలంగాణలో వారిని పెంచిపోషిస్తున్న వారికి ఎంత వుండాలి. రూపాయి రూపాయి పోగేసుకొని, సినిమా కోసం వందలు ఖర్చు చేస్తున్నవారి వినోదం ముసుగులో విషాదం ఎదురైతే పాలకులు కూడా అలాగే స్పందించాల్సి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చేస్తున్నది ముమ్మాటికీ న్యాయం అనిపిస్తుంది. ఇంత కాలం తెలంగాణ ప్రభుత్వాల ఉదారతను చేతగాని తనం అనుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం. తెలంగాణ ఆత్మగౌరవ ప్రభుత్వం. తెలంగాణ ప్రగతిని కాంక్షించే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. ఆ సంగతి తెలియకు గత పోకడలు పోదామని చూస్తే తాట తీసే ప్రభుత్వం వచ్చింది. రాజకీయం కోసమో, ఓట్ల కోసం ఆశపడి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే నాయకుడు కాదు రేవంత్‌రెడ్డి. తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే రేవంత్‌రెడ్డికి తెలుసు. తనను ఎన్నుకొన్ని కుర్చీలో కూర్చోబెట్టిన వారి రుణం తీర్చుకోవడమే రేవంత్‌ లక్ష్యం. అంతే కాని తెలంగాణ తిండి తింటూ, ఆంద్రా పాట పడే అవకాశవాదులకు తగిన బుద్ది చెప్పే నాయకుడు రేవంత్‌రెడ్డి. అందుకే ఇప్పుడు సినీ పరిశ్రమ గజగజ వనుకుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాలకుడు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో సినిమా వాళ్లకు పెద్ద పీట వేసి కూర్చోబెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గత పాలకులు వారికే ప్రాదాన్యతనిస్తూ వచ్చారు. తెలంగాణ సినిమాకు రోజులు రాకుండా చేశారు. తెలంగాణ సినిమా అస్ధిత్వానికి ఊపిరి తీశారు. కనీసం ఉద్యమ కాలంలో కొన్ని తెలంగాణ సినిమాలు వచ్చేవి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సినిమాలు రావడమే తగ్గిపోయింది. ఆ పాపంలో కేసిఆర్‌ పాత్ర కూడా వుంది. ఆంద్రా సినిమాలకు పెద్దఎత్తున ప్రోత్సహకాలు కల్పించడం. ఆంద్రా సినీ పెద్దలు మరణిస్తే వారికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయడం. సినిమా పెద్దలను పిలించుకొని మాట్లాడడం. తన రాజకీయ అవసరాల కోసం వారిని ఉపయోగించుకోవడం. ఆఖరుకు బిఆర్‌ఎస్‌కు ప్రచారం కోసం కూడా ఆంద్రా కళాకారులను వినియోగించుకున్నారు. మొత్తంగా తెలంగాణ కళారంగాన్ని నిర్వీర్యం చేశారు. కాని ఇప్పుడు అసలైన తెలంగాణ ఆవిషృతమౌతోంది. రేవంత్‌ నాయకత్వంలో తెలంగాణ తలెత్తుకు నిలబడుతోంది. ఆంద్రా సినీ ఆధిపత్యానికి అడ్డు కట్ట పడుతోంది. తెలంగాణలో ముసుగులో ఆంద్రా వారికి కొమ్ము కాస్తున్న వారి కొమ్ములు విరిచే పని మొదలైంది. తెలంగాణలో వుంటూ జై తెలంగాణ అనలేని వారికి ఇక చుక్కలు కనిపించే రోజులు రానున్నాయి. అది అల్లుతో మొదలైంది. అల్లు కుటుంబం తెలంగాణ ప్రభుత్వాన్ని తక్కువగా అంచనా వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని దిక్కరించే ప్రయత్నం చేశారు. చెరపకురా…చెడేవు అన్న సామెతను నిజం చేసుకున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్‌ చేసింది తప్పు. ఆ తప్పునుంచి బైట పడేందుకు ఒక్క క్షమాపణ చెబితే పోయేది. కాని పంతానికి పోయాడు. తగ్గేదేలే అనుకున్నాడు. ఇరుకున్నాడు. అల్లు వ్యవహారం అసెంబ్లీలో చర్చదాకా దారి తీసింది. అయినప్పుడైనా అల్లు అర్జున్‌ తగ్గితే బాగుండేది. ముఖ్యమంత్రికి సారీ చెబితే సమస్య ఎప్పుడో సర్ధుమణిగేది. కాని కావాలని రెచ్చగొట్టి ఇప్పుడు అల్లు అర్జున్‌ చుక్కలు చూస్తున్నాడు. తన కొడుకును చూస్తే గుండె తరుక్కుపోతుందని అల్లు అరవింద్‌ చెప్పిన మాటలను కూడా ఎవరూ విశ్వసించలేకపోతున్నారు. కారణం వారి నక్క వినయాలు ఎవరూ నమ్మే పరిస్ధితి లేకుండాపోయింది. అసలు అల్లు అర్జున్‌ పోలీసులు వద్దన్నా సినిమా చూసేందుకు సంధ్య ధియేటర్‌కు రావడం మొదటి తప్పు. సినిమా హిట్‌ అయిన తర్వాత కూడా ధియేటర్‌కు వచ్చి హంగామా చేయడం అన్నది అహాన్ని ప్రదర్శించడమే అవుతుంది. పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టి, ధియేటర్‌కు రోడ్‌షోలాగా రావడం రెండో తప్పు. పెద్దఎత్తున తోపులాట జరుగుతోంది. ఆ సంఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు చావు బతుకుల్లో వున్నాడని చెప్పినా అల్లు అర్జున్‌ తన ఆటిట్యూడ్‌ చూపిండం మూడో తప్పు. సినిమా మొత్తం చూసే వెళ్తాను. ఒక పాట అయిపోయిన తర్వాత వెళ్తాను. లాస్ట్‌ ఫైట్‌ అయిన తర్వాత వెళ్తానంటూ పోలీసుల సహనానికి పరీక్ష పెట్టడం మరో తప్పు. పోలీసులు ఇక లాభం లేదని బలవంతంగా బైటకు తీసుకొచ్చి కారెక్కిస్తే, రూప్‌ టాప్‌ ఓపెన్‌ చేసి మళ్లీ తన దిక్కుమాలిన సైగలతో అభిమానుల మధ్య షో చేయడం మరో పొరపాటు. పది రోజుల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు మహిళ చనిపోయిన విషయం తనకు మరుసటి రోజు ఉదయం వరకు తెలియదని అల్లు అర్జున్‌ చెప్పడం పచ్చి అబద్దమని ఎవరికైనా అర్ధమౌతోంది. ప్రీమియర్‌ షో రోజు మీడియా అంతా అక్కడేవుంది. కొన్ని వందల యూట్యూబ్‌ ఛానళ్లు లైవ్‌ ప్రసారాలిస్తున్నాయి. సినిమాకు వచ్చిన మహిళ రేవతి చనిపోయిందన్న వార్త దావాణలంగా పాకిపోయింది. ఈ విషయం పోలీసులు అల్లు అర్జున్‌కు చెప్పడం జరిగింది. అందుకే బన్నీని సినిమా హాల్‌ నుంచి బైటకు తేవడం జరిగింది. అయినా నాకు మరుసటి రోజు వరకు తెలియలేదని చెప్పడంతోనే అల్లు పాపం పండిరది. పైగా ఈవెంట్లన్నీ రద్దు చేసుకున్నానని చెప్పడం జరిగింది. ఎవరి కోసం రద్దు చేసున్నాడు? అసలు మూడేళ్లు కష్టపడి సినిమా ఎవడు తీయమన్నాడు? ప్రజల కోసం సినిమా తీశావా? అదేమైనా సందేశాత్మక సినిమానా? ఒక దుంగల దొంగ చేసే చట్ట వ్యతిరేక చర్యలకు తన పిచ్చి వేషాలు తోడు చేసుకొని సినిమా తీశాడు. వెయ్యి రూపాయలిస్తా ముద్దు పెడుతుందో అడిగిరాపో..అనే డైలాగులు చెప్పినప్పుడే అల్లు ఎలాంటి సందేశమిస్తున్నారో తెలిసిపోయింది. సినిమా అంటే వినోదం అన్నది ఎన్నడో మారిపోయింది. సందేశాత్మక సినిమాలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడంతా వ్యాపారం. అలా చేసే వ్యాపారంలో నీతి లేకపోతే అధో గతే అన్నది ఇప్పటికైనా సినీ పెద్దలు ఆలోచించుకోవాలి. ఆత్మ విమర్శ చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!