Judicial Probe Demanded on Operation Kagar Encounters
ఆపరేషన్ కగార్ ఎన్ కౌంటర్లపై న్యాయవిచారణ జరపాలి
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
భూపాలపల్లి నేటిధాత్రి
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రప్రభుత్వం జరుపుతున్న మావోయి స్టుల ఎన్ కౌంటర్ల పై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్య దర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏఐటీయూసీ కొమురయ్య భవన్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ తో కలిసి శ్రీనివాసరావు మాట్లాడుతూ కగార్ ఎన్ కౌంటర్లపై అనేక అను మానాలు ఉన్నాయని, మావోయిస్టుల ఎన్ కౌంటర్ లపై స్వయంగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీక రించి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశా రు. మావోయిస్టులను కోర్టుకు సరెండర్ చేయకుండా టెర్రరిస్టుల మాదిరిగా చంపడం సరికాదన్నారు. అలాగే మావోయిస్టులు కూడా పునరాలోచన చేయాలని, తమ పంథా మార్చుకోవాలని కోరారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని ఇప్పటికే కొందరు బయటికి వచ్చారని, మిగిలిన వారు కూడా తమ పంథా మార్చుకొని కమ్యూనిస్టులతో కలిసి రావాలని కోరారు. దేశం లో బిజెపి ప్రభుత్వం నరహంతక పాలన సాగిస్తూ
న్నదని, కేవలం కార్పొరేట్, పెట్టుబడిదారీ శక్తుల కోసమే పనిచేస్తున్నదన్నారు. ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి చెందిన రూ.33 వేల కోట్లను ఆదానీ గ్రూపులో పెట్టుబడి పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలన చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ చర్య లకు వ్యతిరేకంగా పోరాడేందుకు వామపక్ష ప్రజా తంత్ర శక్తులు బలపడాల న్నారు. అందుకు మావో యిస్టులు కలిసి రావాలని కోరారు. రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్ 26 నాటికి సిపిఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ బస్సు జాతాలను నిర్వహిస్తున్నదన్నారు. ఈనెల 15న జోడేఘాట్లో ప్రారంభమైన జాతా భద్రాచలం వరకు కొనసాగుతుందన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే వందేళ్ల సభకు వేలాదిగా
తరలి రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న లేకున్నా పేదల పక్షాన నిలిచేది కమ్యూనిస్టు పార్టీలేనని అన్నారు. సమావేశంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు మోటపలుకుల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి జి సుధాకర్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్,క్యాథరాజ్ సతీష్, మాతంగి రామచందర్, కొరిమి సుగుణ, నూకల చంద్రమౌళి, నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ గోలి లావణ్య, పొన్నగంటి లావణ్య తదితరులు పాల్గొన్నారు.
