Demand to Stop Relocation of 100-Bed Hospital from Katryala Village
కట్ర్యాల గ్రామం నుంచి వంద పడకల ఆసుపత్రిని తరలిస్తే ఊరుకునేదే లేదు
భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట.(నేటిధాత్రి):
వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామం ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిర్మించ తలపెట్టిన వంద పడకల ఆసుపత్రిని వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రానికి తరలిస్తే ఊరుకునేది లేదని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని హెచ్చరించారు. మూడు మండలాల ప్రజలకు అందుబాటులో విధంగా నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని నియోజకవర్గ కేంద్రం వర్ధన్నపేటకు తరలించడం ద్వారా మూడు మండలాలకు చెందిన గ్రామాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని దానిని గుర్తుంచుకొని ఎక్కడైతే వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు అక్కడే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తగిలిందని ఇప్పటికైనా ఆ పార్టీ బుద్ధి తెచ్చుకొని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య విద్య అందించడం కోసం ప్రజలకు అనువైన సౌకర్యాలను కల్పించడం కోసం పని చేస్తే బాగా ఉంటుందని మహేందర్ రెడ్డి అన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం లోని గ్రామాలకు ఎటువంటి అభివృద్ధి చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఖాళీ శంకుస్థాపనలతో కాలయాపన చేస్తూ కాంగ్రెస్ నేతల జేబులు నింపుకోవడం కోసం కొన్ని మాఫియాలను పెంచుకుంటూ పోతూ వారి స్వలాభం కోసం వారి కుటుంబ స్వలాభం కోసం పనిచేస్తూ ఉన్నారని అది గమనించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరియు ఎమ్మెల్యేకి గట్టిగా బుద్ధి చెప్పారనేది వర్ధన్నపేట నియోజకవర్గంలో నిరూపణ జరిగిందని అని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని మేజర్ గ్రామపంచాయతీలు అయిన పంతిని .కట్ర్యాల. గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా పార్టీ జెండా ఎగరవేసిందని అలాగే కక్కిరాలపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఉపసర్పంచ్ చేజిక్కించుకోవడం జరిగిందని ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయడం కడారి గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని దీన్ని ఆలోచించి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుద్ధి తెచ్చుకోవాలని గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప్పరపల్లి అయినవోలు పున్నేలు గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకుండా ప్రతిపక్షాలు పనిచేశాయని అదేవిధంగా పర్వతగిరి మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ తన జెండా ఎగరవేసిందని తెలియజేశారు ఈ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు అధికార పార్టీకి గట్టి బుద్ధి చెప్పారని కావున ప్రజలకు అవసరమైన పనులను అతి త్వరలో చేపట్టి వారికి అవసరమైన అన్ని విధాల విద్య వైద్య నీటి సౌకర్యం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి రావలసిన దేవాదుల కాలువ ద్వారా నీరు నీరు ఇప్పటికీ తేకపోవడం ఎంత విడ్డూరంగా ఉంది అంటే ఇచ్చిన హామీలను మరిచిపోయి నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ప్రజలకు న్యాయం చేయకపోతే నిత్యం ప్రభుత్వం ప్రజల వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని ప్రజల సహకారంతో ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిర్మించ తలపెట్టిన 100 పడకల ఆసుపత్రిని తరలిస్తే పెద్ద ఉద్యమాన్నిగా నిర్మించి గట్టిగా బుద్ధి చెప్తామని వచ్చే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేస్తామని మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హెచ్చరించారు.
