నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)పురుషుడితో సమాన స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళను అబల అనడం సరికాదని కమలాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ నరేష్ అన్నారు.గురువారం ఆరోగ్య కేంద్రములో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదని,సమాజం మహిళా పట్ల చిన్న చూపు చూడడం, అబల అంటూ సరైన గౌరవం ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు.మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం,సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో వైద్యులు నాగరాజ్,విజిత,రవి,వరుణ్,బానుచందర్,వైద్య సిబ్బంది జ్యోతి తదితరులు పాల్గొన్నారు.