మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ప్రజావాణిలో తమకు అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని నవాబుపేట ఎంపీడీవో జయరాం నాయక్ తెలిపారు. ఎంపీడీవో పర్యవేక్షణ లో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఈ సందర్భంగా జయరాం నాయక్ మాట్లాడుతూ. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం చెప్పట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సంబంధిత విభాగాలతో తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నవాబుపేట మండల పరిధిలోని , గ్రామాలలో స్థానికంగా నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంగళవారం జరగబోయే మండల స్థాయి ఆటల పోటీలు మండల పరిషత్ ప్రాంగణంలో ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల్ లెవెల్ ఆఫీసర్స్, తదితరులు పాల్గొన్నారు.