ప్రజావాణిలో సమస్యల కుప్పలు 

పరిష్కారం ఎప్పుడు అని అడుగుతున్న ప్రజలు,,,,,

రామాయంపేట మున్సిపాలిటీలో పరిష్కారం కాని సమస్య,,,,,

డబుల్ బెడ్ రూమ్ కోసం నిర్వాసితుల దరఖాస్తులు,,,,,

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.

తాసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల వెల్లువ ప్రవహిస్తున్నది. అనేక సమస్యలతో పట్టణ ప్రజలు ఇతర కార్యాలయాలకు పోక పోయినాక సమస్య పరిష్కారం కాక ప్రజావాణికి క్యూ కడుతున్నారు.
రామాయంపేట మున్సిపాలిటీ ఆధీనంలోని ఐదో వార్డులో పెట్రోల్ బంక్ వెనుక ఉన్న కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా నీరు కాలనీ మధ్యలో చిన్న చెరువుగా మారి ఆ ప్రాంతమంతా బురద మయంగా మారడంతో కాలనీ వాసులకు వాహనాలకు గాని నడిచి వచ్చేవారికి కానీ, ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు వాపోతున్నారు. ఈ విషయమై మున్సిపాలిటీ కౌన్సిలర్ ఐదో వార్డ్ శోభ కొండల్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమస్య లక్షల్లో తీరేది కాదని కోట్లల్లో అయితేనే పరిష్కారం అవుతుందని బీసీ కాలనీ నుంచి వచ్చే నీరు ఇక్కడ పడడంపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇప్పట్లో మాత్రం తక్షణంగా ఈ సమస్య పరిష్కారం కాదని తేల్చి చెప్పారు. మళ్లీ బడ్జెట్ వచ్చినప్పుడు కోట్లలో పనిచేయడం జరుగుతుందని అప్పటివరకు ఏమి చేయలేమని ఆయన తెలిపారు. కాలనీవాసులు మాత్రం ఎంత కాలం వేచి ఉండాలి కష్టకాలంలో ఆదుకోకపోతే ఏమి లాభమని పెద విధిస్తున్నారు. కాలేజీకి వెళ్లే విద్యార్థులకు అక్కడ బ్రిలియంట్ పాఠశాలను మెదక్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆశ్రయంగా అప్పగించడం జరిగింది. బాలికలు కాలేజీకి వెళ్లడానికి రావడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయని స్థానికులు అంటున్నారు. వెంటనే ఏమైనా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిష్కారం చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగడానికి వెనుకాడమని కాలనీవాసులు హెచ్చరించారు. అలాగే రామాయంపేట తహసిల్దార్ రజని కుమారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతున్నదని ఆమె అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 80 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిష్కరించడానికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. దరఖాస్తుల్లో బుడగ జంగాల కులానికి చెందిన ఎల్లవ్వ గత 40 సంవత్సరాలుగా రామయంపేట పట్టణంలో నివసిస్తున్న తాము పింఛన్ కూడా రాలేదని కనీసం నివసించడానికి ఇల్లు లేదని ఆమె వాపోయారు. తమ భర్తకు కూడా పింఛన్ రావడం లేదని ఎలా బతకాలని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వవలసిందని తాము అర్హులమని వెంటనే తమకు డబుల్ బెడ్ రూమ్ అన్న ఇవ్వాలని ఆమె దీనంగా అర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!