ఎలక్ట్రానిక్స్ షాపులో దొంగతనం.
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో దొంగలు ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగ షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. కౌంటర్లోని నగదు సహా విలువైన ఎలక్ట్రానిక్ సామాగ్రి ఎత్తుకెళ్లారు. దొంగ చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఘటనపై జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.