కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలు
-కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కె ప్రతాప్
మొగుళ్లపల్లి నేటి ధాత్రి :
కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలని కాంగ్రెస్ పార్టీ మొట్లపల్లి గ్రామ ఉపాధ్యక్షుడు కె ప్రతాప్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ ఒక కుడి భుజం లాంటిదని, కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలని, పార్టీకి యూత్ సేవలు కీలకమని ఈ సందర్భంగా అభివర్ణించారు. ఏఐసీసీ నుంచి మండల కమిటీ వరకు ఏ పిలుపు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొని, పార్టీ కార్యకలాపాలలో ముందుండి పార్టీని నడిపించే విధంగా యూత్ కాంగ్రెస్ ఎప్పుడు ముందుండాలని ఆయన యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు.