తమ్ముడు ప్రేక్షకులను మెప్పిస్తాడు…
‘నా గత చిత్రాలు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించలేదు. కానీ ‘తమ్ముడు’ సినిమా మిమ్మల్ని నిరాశ పరచదు. దర్శకుడు వేణు శ్రీరామ్ ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రంగా.‘నా గత చిత్రాలు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించలేదు.
కానీ ‘తమ్ముడు’ సినిమా మిమ్మల్ని నిరాశ పరచదు. దర్శకుడు వేణు శ్రీరామ్ ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రంగా తీర్చిదిద్దారు.
ఇక నుంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను’ అని హీరో నితిన్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘తమ్ముడు’ చిత్రం ఈ నెల 4న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. నితిన్ మాట్లాడుతూ ‘80 రోజులు అడవుల్లోనే ఉండి ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని ‘తమ్ముడు’ షూటింగ్ పూర్తి చేశాం’ అని అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ‘చిత్రబృందం కష్టం వల్లే ‘తమ్ముడు’ సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది.
దర్శకుడు శ్రీరామ్ వేణు తన విజన్‌ను అద్భుతంగా తెరపైకి తెచ్చారు.
ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ పూర్తిగా ఆయనకే దక్కుతుంది.
నితిన్‌కు ఇది కమ్‌బ్యాక్ మూవీ అవుతుంది. రామ్‌చరణ్‌తో ఓ సూపర్‌హిట్ మూవీ చేయబోతున్నాం. త్వరలో వివరాలు ప్రకటిస్తాం’ అని చెప్పారు.
శిరీష్ మాట్లాడుతూ ‘‘తమ్ముడు’తో నితిన్‌కు హిట్ ఇస్తామని నిర్మాతగా మాట ఇస్తున్నాను’ అని అన్నారు. శ్రీరామ్ వేణు మాట్లాడుతూ ‘థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ‘తమ్ముడు’ సినిమాను డిజైన్ చేశాను.
కుటుంబ అనుబంధాలతో పాటు వాణిజ్య హంగులు కలబోసిన చిత్రమిది’ అని చెప్పారు.
‘ఇందులో కొత్త తరహా పాత్ర చేశాను’ అని లయ తెలిపారు.
‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం, పాత్రల తాలూకు భావోద్వేగాలకు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు’ అని సప్తమి గౌడ చెప్పారు. థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిన చిత్రమిదని వర్ష బొల్లమ్మ అన్నారు.