
జైపూర్, నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్, రబ్బర్, చాక్ మార్,స్కేల్ యువ నాయకుడు గుండా సురేష్ గౌడ్ బహుమతిగా పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని పదవ తరగతి వార్షిక పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని కోరడం జరిగింది. అదేవిధంగా స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి బహుమతి కూడా ఇస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూట జ్యోతి, పండరి,నేరెళ్ల నరేష్ గౌడ్, కోమటి సంపత్ కుమార్, చంద్రయ్య, నారాయణ, మల్లేష్, సంజీవ్, రాజం, లింగయ్య, బుచ్చయ్య మరియు పాఠశాల సిబ్బంది ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్,శ్రీలత, సురేందర్,పవన్, కిరణ్మయి, రమణా రెడ్డి, సురేందర్, విజయదుర్గ,కల్పన తదితరులు పాల్గొన్నారు.