చంద్రగిరి శంకర్
జిల్లా కన్వీనర్
ఏఐసిసిటియు
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు, చేయడంలో ప్రభుత్వాలు, పాలకులు విపలమయ్యారు. ఈ నేపథ్యంలో కార్మిక వర్గం చైతన్యంతో పోరాడి సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గత అనుభవాలతో గుణ పాఠాలు నేర్చుకొని, రెట్టింపు ఉత్సాహంతో ఈ సింగరేణి కార్మిక వర్గం కోసం రాజీలేని పోరాటాలను రూపొందించుకోవాలి. దాదాపు ఆరు సంవత్సరాల తరువాత సింగరేణిలో గుర్తింపు సంఘం 7వ దఫా ఎన్నికలు ఏఐటీయూసీ 5 డివిజన్ లు గుర్తింపు సంఘాలుగా ఏర్పడినవి. ఏరియా ప్రాతినిధ్య సంఘముగా ఐఎన్ టియుసి 6 డివిజన్ లు గెలిచింది. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల అమలు కావడం లేదు.
ఏఐసిసిటియు
జిల్లా కన్వీనర్ చంద్రగిరి శంకర్ అన్నారు
ప్రతికూల పరిస్థితిలో పని చేస్తు లోకానికి వెలుగులు నింపే చీకటి సూర్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, ఆదాయ పన్ను చర్చించాలని, కార్మికులకు సీనియారిటీ ప్రకారం క్వార్టర్స్ కేటాయించాలని, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్స్, గని వద్ద కార్మికునికి సంబంధిచిన పనిముట్లు సామానులు కల్పించాలని కార్మిక లోకం డిమాండ్ చేస్తుంది. ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కారానికి నోచుకోక సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నవి. సింగరేణిలో ఉపం తల గనులు ఏర్పాటు చేయడం లేదు. గతంలో 56 గనులు ఉంటే 23 కు చేరుకున్నవి. రాష్ట్ర భుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ భూగర్భ గనులు ఏర్పాటుపై దృష్టి సారించడం లేదు. సింగరేణి కార్మికులకు వైద్యం అందించేందుకు డిస్పెన్సరీలు, అస్పత్రులు ఉన్నాయి. కానీ అత్యాధునిక వైద్య సిబ్బంది సౌకర్యం లేదు. సదుపాయాలు లేవు. అందుచేత పరికరాలు లేవని ప్రైవేట్ ఆస్పత్రులకు సిఫారుసు చేస్తున్నారు. దీంతో కార్మికులు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. బదిలీలు, ప్రమోషన్లు లేవు. కార్మికులకు వివిధ అలవెన్సులు ఇవ్వడం లేదు.
గత ప్రభుత్వాలు, గత గుర్తింపు సంఘ నాయకులు వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి, మెడికల్ బోర్డు అని పెట్టి 60 సంవత్సరాల సర్వీస్ ను 61 సంవత్సరాలకు పెంచి కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నారు. వారసత్వ ఉద్యోగాలు కొనసాగాలని ఎన్నిక కాబడిన గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం యాజమాన్యంపై మరియు ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయడం లేదు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి, సంస్థ ఉన్నతికి, ఉత్పత్తికి కృషి చేయాలి. అన్ని పిరియాలో ఉన్న సెండింగ్లో ఉన్న ప్రమోషన్లు ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకొని ఇవ్వడం లేదు. వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి. గుర్తింపు సంఘం ఎన్నికల ఆరు నెలలు కావస్తుంది. దానికి ఆర్ ఎల్ సి నుండి ఇంతవరకు ఎలాంటి అనుమతులు రాలేవు. అన్ని ఏరియాలలో అన్ని యూనియన్లు, యాజమాన్యంతో కలుపుకోవాలి.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో గెలుపు కొరకు కార్మికుల ఓట్లు వాడుకోవడానికి ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. వెంటనే అసెంబ్లీలో, పార్లమెంట్లో తీర్మానం చేయాలి. రిటైర్మెంట్ అయినా ప్రతి సింగరేణి కార్మికునికి కనీస పెన్షన్ 15000/- అందించాలి. రెండు సంవత్సరాల కాలం పరిమితితో గుర్తింపు పత్రం ఇవ్వాలి.. గెలిచాక గుర్తింపు పత్రం కాలపరిమితిపై తప్పుదారి పట్టిస్తున్న ఏఐటీయూసీ విధానాన్ని కార్మిక లోకం తిప్పికొట్టాలి. ఎన్నికలకు ముందు డిప్యూటీ లేబర్ కమిషనర్ తో జరిగిన సమావేశంలో గుర్తింపు కాలపరిమితి పై అన్ని కార్మిక సంఘాల అభిప్రాయాన్ని కోరగా 15 సంఘాలలో ఐదు సంఘాలు మాత్రమే నాలుగు సంవత్సరాలు కావాలని కోరాయి. మిగతా 11 సంఘాలు రెండు సంవత్సరాలు కావాలని కోరాయి. అట్టి నిర్ణయాన్ని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఢిల్లీలోని చీఫ్ లేబర్ కమిషనర్ కు పంపగా సెంట్రల్ కోడ్ ఆఫ్ డిసిప్లేన్ ప్రకారం రెండు సంవత్సరాల SPO పరిమితితో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ డిప్యూటీ సిల్ కి లెటర్ రాస్తారు. గెలిచిన నుండి రెండు సంవత్సరాల వరకు గుర్తింపు సంఘంగా ఉండాలి. కానీ ఇప్పటివరకు లెటర్ అందజేయకపోయేసరికి సంఘాలు నష్టపోవడం జరుగుతుంది.